ETV Bharat / bharat

Lady Constable Suicide : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై 500 గాయాల మరకలు.. ఏం జరిగింది? - swiss woman murder in delhi

Lady Constable Suicide : బలవన్మరణానికి పాల్పడిన ఓ మహిళా కానిస్టేబుల్​ మృతదేహంపై 500పైగా గీసుకుపోయిన గాయాల మరకలు ఉండటం కలకలం రేపింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Lady Constable Suicide
Lady Constable Suicide
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 9:43 PM IST

Updated : Oct 21, 2023, 10:37 PM IST

Lady Constable Suicide : ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్ మృతదేహంపై 500పైగా గాయాల మరకలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్​ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపై ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్.. పోలీస్​ లైన్​లోని హాస్టల్​లో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గది​లోని ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయినట్లు వెల్లడైంది. అయితే మీను మృతదేహాంపై 500పైగా గాయాల మరకలు ఉన్నట్లు వెల్లడైంది.

అయితే, చనిపోయిన మహిళా కానిస్టేబుల్​ అలీగఢ్​కు చెందిన ఓ కానిస్టేబుల్​తో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే చోట పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్​చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో మీను తీవ్ర మనస్తాపానికి గురై.. తనకు తాను గాయపరచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇష్టపడలేదు.

స్విస్​ మహిళ హత్య.. నిందితుడు అరెస్ట్..
స్విట్జర్లాండ్​కు చెందిన ఓ మహిళను హత్య చేసిన ఘటనలో గుర్​ప్రీత్​ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. 'నాలుగేళ్ల క్రితం బాధితురాలు, గురుప్రీత్​కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అయితే బాధితురాలిని కలవాలని నిందితుడు స్విట్జర్లాండ్​ నుంచి ఇండియాకు రప్పించాడు. అనంతరం గొలుసులతో ఆమె కాళ్లు, చేతులు కట్టిపడేశాడు. పది నిమిషాల్లో సర్​ప్రైజ్​ ఇస్తానని గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని దిల్లీలోని తిలక్​ నగర్ ప్రాంతంలో పడేశాడు' అని పోలీసులు తెలిపారు.

మృతదేహాన్ని గుర్తించిన బాటసారులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్​ సాయంతో నిందితుడిని గుర్తించారు. ఆ కారుతో పాటు రూ.1.5 కోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో యువతి గుర్తింపు కార్డుతో నిందితుడు కారు కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ మహిళ చనిపోవడానికి 8-10 రోజుల ముందు వరకు నిందితుడు ఆమెతో టచ్​లో ఉన్నాడని తేలింది.

రెండేళ్ల బాలుడిని చంపిన కసాయి తండ్రి..
Father Killed His Son : ఉత్తర్​ప్రదేశ్​.. అలీగఢ్​ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ కసాయి తండ్రి రెండేళ్ల కుమారుడిని నెలకేసి కొట్టి హత్య చేశాడు. తప్పల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఆదంపుర్​కు చెందిన దంపతులు ప్రేమ్​చంద్​ అలియాస్ రవి, ఖుష్భూకు రెండేళ్ల కుమారుడు లవ్​కుష్ ఉన్నాడు. మద్యానికి బానిసైన రవి తరచూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడేవాడు. అయితే రవి మద్యం తాగేందుకు ఖుష్భూ నిరాకరించింది. అనంతరం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రవి.. తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని బలవంతంగా లాగి నేలకు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఖుష్భూ. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Drunken Father Killed 3 Daughters : ట్రంకు పెట్టెలో ముగ్గురు బాలికల మృతదేహాలు.. విషం పెట్టి చంపిన తండ్రి.. మద్యానికి బానిసై..

Student Gangrape : ఎగ్జామ్​ రాస్తున్న 'ఆమె' కిడ్నాప్​.. ఆటోలో మద్యం తాగించి.. హోటల్​లో గ్యాంగ్​రేప్​ చేసి..

Last Updated : Oct 21, 2023, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.