ETV Bharat / bharat

Ladakh Election Results 2023 : లద్దాఖ్ ఎన్నికల్లో కాంగ్రెస్​ కూటమి ఘన విజయం.. బీజేపీ డీలా - లద్ధాఖ్​ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్

Ladakh Election Results 2023 : లద్దాఖ్ హిల్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్​- ఎన్​సీ కూటమి విజయం సాధించింది. మొత్తం 26 సీట్లలో ఎన్​సీ 12 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ 10 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. ఈ విజయంపై రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.

Ladakh Election Results 2023
Ladakh Election Results 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 7:30 AM IST

Ladakh Election Results 2023 : లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్​మెంట్ కౌన్సిల్- ఎల్​ఏహెచ్​డీసీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మొత్తం 22 సీట్లు గెలుచుకుని విజయదుందుభి మోగించింది. అక్టోబర్ నాలుగో తేదీన కౌన్సిల్​లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 12 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్ర పక్షం కాంగ్రెస్ పది స్థానాల్లో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ, స్వతంత్రులు తలా రెండుస్థానాల్లో గెలుపొందినట్లు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసి, లద్దాఖ్​ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలని అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో 77.61 శాతం ఓటింగ్​ నమోదైంది. 95,388 మంది ఓటర్లలో 74,026 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం నేషనల్​ కాన్ఫరెన్స్​ నేతృత్వంలో ఉన్న హిల్​డెవలప్​మెంట్​ కౌన్సిల్​ పదవీకాలం అక్టోబర్​ 1న ముగిసింది. కొత్తం కౌన్సిల్ అక్టోబర్​ 11 లోపు కొలువుదీరుతుంది. ఎన్​సీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ముందు కూటమిని ప్రకటించాయి. కానీ ఎన్​సీ 17, కాంగ్రెస్ 22 మందిని ఎన్నికల్లో నిలబెట్టాయి. అయితే బీజేపీ బలంగా ఉన్న ప్రాంతానికే ఈ వ్యూహాన్ని పరిమితం చేసినట్లు ఇరు పార్టీలు తెలిపాయి. గతంలో ఒక సీటు గెలిచిన బీజేపీ ఈసారి 17 మంది అభ్యర్థులతో అదృష్టం పరీక్షించుకుంది. ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. 25 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 278 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన కౌన్సిల్ ఎన్నికలకు తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.

'ఇది భారత్​ జోడో యాత్ర ప్రభావమే'
ఈ కౌన్సిల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ పది స్థానాలు గెలుచుకోవడంలో తమ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర ప్రత్యక్ష ప్రభావం ఉందని ఆ పార్టీ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో పోస్ట్​ చేశారు. మరోవైపు పదేళ్ల తర్వాత లద్దాక్ హిల్​ కౌన్సిల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అఖండ విజయాన్ని నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అన్నారు.

  • The national media of course will blank it out, but trends coming in show Congress leading convincingly in the elections to the Ladakh Autonomous Hill Development Council, Kargil with an almost complete wipeout of the BJP. This is a direct impact of @RahulGandhi continuing…

    — Jairam Ramesh (@Jairam_Ramesh) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • We have registered a resounding victory in the Ladakh-Kargil Autonomous Hill Council elections after 10 years!

    Along with our INDIA partner National Conference, we have swept the entire region in its first election after the abrogation of Art. 370.

    Sh. @RahulGandhi ji’s…

    — K C Venugopal (@kcvenugopalmp) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ కౌన్సిల్​ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి తిరిగులేని విజయం అన్న కాంగ్రెస్​ సీనియర్​ నేత పి చిదంబరం.. బీజేపీకి ఘోర పరాజయం అని చెప్పారు. 'ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి బీజేపీ తప్పుదోవ పట్టించే ఎజెండాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఫలితాలు చూపిస్తున్నాయి. ఒకవేళ కశ్మీర్​లో ఎన్నికలు జరిగినా.. ఫలితాలు వీటికంటే భిన్నంగా ఉండవు' అని వెల్లడించారు. లద్దాఖ్-కార్గిల్ ప్రజలు నిర్ణయాత్మకంగా మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు.

  • The Ladakh Autonomous Hill Development Council, Kargil, result is a resounding victory for I.N.D.I.A. and a crushing defeat for the BJP.

    The results show that the people have totally repudiated the misguided agenda of the BJP, the revocation of Art. 370 and the creation of Union…

    — P. Chidambaram (@PChidambaram_IN) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rahul Gandhi Bike Ride : స్టైలిష్ లుక్​లో రాహుల్ గాంధీ.. స్పోర్ట్స్​ బైక్​పై లద్ధాఖ్ టూర్​

Rahul On China New Map : 'మోదీవి అబద్ధాలని ఏళ్లుగా చెప్తున్నా.. చైనా మ్యాప్‌పై ప్రధాని ప్రకటన చేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.