మహారాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమల్లోకి రావడం వల్ల ప్రధాన నగరాలు, పట్టణాల్లో రద్దీ బాగా తగ్గిపోయింది. ముంబయి, పుణె, నాగ్‌పుర్ వంటి నగరాల్లో ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. నిత్యావసరంకాని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_mumbai.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_mumbai3.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_pune.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_pune2.jpg)
కేసులు ఎక్కువగా ఉన్న పుణె వంటి నగరాల్లో.. పండ్లు, కూరగాయల మార్కెట్‌లలో రద్దీ మాత్రం కొనసాగుతోంది. భౌతిక దూరం నిబంధనను ప్రజలు పాటించడం లేదు. కొందరైతే మాస్కు నిబంధనలను కూడా గాలికొదిలేస్తున్నారు.
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_market.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_markets-1.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_curfew-in-baramati.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_nagpur.jpg)
ముంబయి నుంచి వలస కార్మికులు, కూలీలు సొంతూళ్లకు తరలిపోతూనే ఉన్నారు. ఫలితంగా ముంబయిలోని లోకమాన్య తిలక్ రైల్వే టెర్మినస్‌కు భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తుతున్నారు. లాక్‌డౌన్ తరహా ఆంక్షలు ప్రకటించకముందు నుంచే ఎల్టీటీ వద్ద వలస కూలీలు, కార్మికుల రద్దీ కొనసాగుతోంది. సాధారణ ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా దూర ప్రాంత రైళ్లలో వెళ్లిపోతున్నారు. టికెట్ ఉంటే తప్ప అనుమతిలేకపోవడంతో ముందస్తు రిజర్వేషన్, తత్కాల్ వంటి మార్గాల్లో బుక్‌చేసుకుని వెళుతున్నారు. రైల్వేస్టేషన్ వద్ద కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_indore.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_police.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_mumbai-roads.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_curfew-in-baramati11.jpg)
![restrictions in maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11409753_nagpur-curfew.jpg)
ఇదీ చదవండి:పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అభ్యర్థి మృతి