కుంభమేళాతో కొవిడ్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి. దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కుంభమేళా నిర్వహణ ఎలా అనే దానిపై సోమవారం ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు.
"కేటాయించిన సమయం కన్నా ముందుగానే కుంభమేళా ముగించకపోతే కొవిడ్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశముంది."
--ఉన్నతాధికారి.
ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై పలు సూచనలు చేశారు అధికారులు. టీవీ, రేడియోల ద్వారా ప్రభుత్వం కుంభమేళాకు హాజరయ్యేవారికి పలు సూచనలు ఇవ్వాలని అధికారులు కోరారు.
ఏప్రిల్ 12, 14, 27న మహాకుంభమేళా స్నానాలు జరగనున్నాయి. నాశిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్ ప్రాంతాల్లో ప్రతి 4 సంవత్సరాలకోసారి ఈ స్నానాలు జరుగుతాయి.
ఇదీ చదవండి: