ETV Bharat / bharat

పెట్రో బాదుడుపై నిరసన- కేరళ​ టు నేపాల్​ సైక్లింగ్​ - కేరళ అప్డేట్స్​

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను వ్యతిరేకిస్తూ.. ఒక్కొక్కరూ ఒక రీతిలో నిరసన తెలుపుతున్నారు. మొన్న తమిళ నటుడు విజయ్​ పోలింగ్​ బూత్​కు వెళ్లేందుకు సైకిలెక్కగా.. తాజాగా మరో వ్యక్తి అదే తరహాలో నిరసన బాటపట్టారు. ఈయన ఏకంగా.. కేరళ నుంచి నేపాల్​ వరకు సైక్లింగ్​ చేస్తున్నారు.

Kozhikode to Nepal by bicycle:  This is Akhilesh's way of protest
ఇంధన ధరలను నిరసిస్తూ.. కోజికోడ్​ టూ నేపాల్​ సైక్లింగ్​
author img

By

Published : Apr 12, 2021, 3:10 PM IST

Updated : Apr 12, 2021, 8:26 PM IST

కేరళ నుంచి నేపాల్​కు అఖిలేశ్​ సైకిల్​ యాత్ర

కేరళకు చెందిన ఓ వ్యక్తి సైకిల్​ యాత్ర చేపట్టి ఇంధన రేట్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్​ నుంచి ఏకంగా.. నేపాల్​కు సైకిల్​పై బయల్దేరారు అఖిలేశ్​.

కోజికోడ్​ టు నేపాల్​..

కోజికోడ్​ జిల్లా వేల్లిమడుకున్ను పూలక్కడవుకు చెందిన అఖిలేశ్​.. ఫిజికల్​ ట్రైనింగ్​ టీచర్​గా పనిచేస్తున్నారు. దేశంలో ఇంధన రేట్లు పెరడటంపై ఆయన ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఇలా సైకిలెక్కి నిరసన బాటపట్టారు. నిరసన అనేది కేవలం రాజకీయ నాయకులు, పార్టీలకే కాదని.. ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశమిచ్చేందుకే ఇలా చేస్తున్నానని చెప్పారు అఖిలేశ్.

కాసరగోడ్​లో ఘన స్వాగతం..

సుదీర్ఘ​ యాత్ర కోసం ఓ పాత సైకిల్​ను సేకరించి.. దానికి మరమ్మతులు చేయించారు అఖిలేశ్​. కోజికోడ్​లో ఆయన యాత్ర ప్రారంభమవ్వగా.. గత శుక్రవారం కాసరగోడ్​కు చేరుకున్నారు. అక్కడివారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అల్పాహారం, శీతలపానీయాలు ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు. మరికొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత.. కాసరగోడ్​ నుంచి తన సైకిల్​ యాత్రను కొనసాగించారు అఖిలేశ్​.

ఇదీ చదవండి: ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు

Last Updated : Apr 12, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.