ETV Bharat / bharat

జాతీయ స్థాయి షూటర్ అనుమానాస్పద మృతి

author img

By

Published : Dec 16, 2021, 10:56 AM IST

Konica Layak death: జాతీయ స్థాయి షూటర్ కోనికా లాయక్.. కోల్​కతాలో అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరిలో వివాహం జరగాల్సి ఉండగా.. ఆమె మరణించడం కుటుంబసభ్యులకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది.

konika layak news
కోనికా లాయక్ మృతి

Konica Layak death: జాతీయ స్థాయి షూటర్ కోనికా లాయక్.. అనుమానాస్పద రీతిలో మరణించారు. శిక్షణ కోసం ప్రస్తుతం కోల్​కతాలో ఉంటున్న కోనికా.. తాను నివసిస్తున్న ప్రదేశంలో విగతజీవిగా కనిపించారు.

కోనికాకు ఆరోగ్యం బాగాలేదని ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో ఉండే ఆమె తల్లికి సమాచారం అందింది. చివరకు కోల్​కతా చేరుకునేసరికి కోనికా ఆస్పత్రిలో మరణించి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి కారణాలు తెలుస్తాయని అధికారులు చెప్పారు.

కోనికకు ఇదివరకే పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వివాహం జరగాల్సి ఉంది. ఇంట్లో ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ తరుణంలో ఆమె మరణించడం కుటుంబ సభ్యులను షాక్​కు గురిచేసింది. తమ సర్వస్వం కోల్పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

konika layak
జర్మన్ రైఫిల్​తో కోనికా లాయక్

Konika Layak Sonu Sood

2014లో షూటింగ్​ కెరీర్​ను ప్రారంభించారు కోనిక. ఝార్ఖండ్​లోని బాస్తకోలాలో శిక్షణ మొదలుపెట్టారు. మధ్యతరగతి నుంచి వచ్చిన కోనిక.. తొలినాళ్లలో తన స్నేహితుల రైఫిల్​తో షూటింగ్ నేర్చుకున్నారు. ఈక్రమంలోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు సరైన రైఫిల్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఈటీవీ భారత్ ఆమె అవస్థలను వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో కోనిక గురించి తెలుసుకున్న సినీ నటుడు సోనూసూద్ ఆమెకు అండగా నిలిచారు. జర్మన్ రైఫిల్ కొనిచ్చి.. ఆమె కలలు నెరవేర్చుకునేందుకు సహకరించారు.

ఇదీ చదవండి: రైల్వే ప్లాట్​ఫామ్​పై కరెన్సీ నోట్లు.. యాచకుడి విచిత్ర ప్రవర్తన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.