ETV Bharat / bharat

తీవ్రమవుతున్న 'యాస్'- శ్యామాప్రసాద్ పోర్టు అప్రమత్తం - yass cyclone news

యాస్ తుపాను క్రమంగా బలపడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు కోల్​కతాలోని శామాప్రసాద్​ ముఖర్జీ పోర్ట్​ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Kolkata port cyclone
'ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు'
author img

By

Published : May 23, 2021, 6:42 AM IST

కోల్​కతాలోని శామాప్రసాద్​ ముఖర్జీ నౌకాశ్రయం 'యాస్' తుపాను​ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టనట్లు అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావం పూర్తిగా పోర్టుపై పడక ముందే ఓడలను డాక్​లోకి చేర్చాలని నౌకల యజమానులను కోరినట్లు పోర్టు ఛైర్మన్​ వినిత్​ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే కోల్​కతా, హల్దియా పోర్ట్​ల వద్ద కంట్రోల్​ రూంలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

"మేం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సరైన సమయంలో మా కార్యకలాపాలను నిలిపివేస్తాం. కోల్​కతా, హల్దియాల వద్ద సీనియర్​ అధికారుల సమక్షంలో కంట్రోల్​ రూమ్‌లను మే 21 నుంచి నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఇప్పటికే టగ్‌బోట్లు, లాంచీలు అందుబాటులో ఉంచాము."

-వినిత్​ కుమార్​, శామాప్రసాద్​ ముఖర్జీ పోర్టు ఛైర్మన్

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను శనివారం అల్పపీడనంగా మారింది. ఇది అతి తీవ్ర తుపాను మారి బంగాల్​, ఉత్తర ఒడిశా వైపుగా ప్రయాణించనుంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఈనెల 26న తుపాను తీరం దాటే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి: మే 26 నాటికి అతి తీవ్ర తుపానుగా 'యాస్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.