Kolkata Durga puja UNESCO: మావనజాతి 'వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ' జాబితాలో కోల్‌కతా దుర్గా పూజలకు స్థానం లభించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రకటించింది. "వర్ణానీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో కోల్‌కతా దుర్గా పూజలను చేర్చాం. భారత్‌కు అభినందనలు" అంటూ బుధవారం యునెస్కో ట్వీట్ చేసింది. 'సజీవ వారసత్వం' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దుర్గాదేవి ఫొటోనూ పెట్టింది. పారిస్‌లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ(ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్- ఐసీహెచ్) కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Pm modi on unesco durga puja: ఆసియాలో ఓ పండగకు ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం. యునెస్కో నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. "ప్రతి ఒక్క భారతీయుడూ గర్వపడే క్షణాలు. దుర్గా పూజ మన సంప్రదాయాలు, ఆచారాల్లో ఉత్తమమైనది. ఈ పూజల అనుభవం ప్రతి ఒక్కరికీ కలగాలి" అంటూ ట్వీట్ చేశారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ .."బెంగాల్‌కు గర్వించే సందర్భం. ప్రపంచంలోని బెంగాలీలకు దుర్గా పూజ అంటే కేవలం పండగ కాదు. అందర్నీ కలిపే ఓ భావోద్వేగం" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం
ఇదీ చూడండి: ఒక్కటైన బధిర జంటలు.. అంగరంగ వైభవంగా వివాహం