కరోనాపై యుద్ధం కోసం తలపెట్టిన టీకా పంపిణీ యజ్ఞంలో 100కోట్ల మైలురాయిని(india vaccination status) అందుకుంది భారత్. గురువారం ఈ ఘనత సాధించింది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగింది(india vaccination count). ఈ నేపథ్యంలో భారత టీకా పంపిణీ ప్రక్రియలో కీలక అంశాలు, ఘట్టాలను ఓసారి చూద్దాం..
- కరోనాపై పోరులో భాగంగా.. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ.. అక్టోబర్ మూడో వారానికి 100కోట్ల మార్కును అందుకుంది. కానీ ఇది అంత సులభంగా జరగలేదు. టీకా పంపిణీ ప్రక్రియలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. టీకాల నిల్వ, సరఫరాకు ఆటంకాలు తప్పలేదు. వాటిని అధిగమించేందుకు రాష్ట్రాలన్నీ కలిసిగట్టుగా అడుగులు వేశాయి.
- టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలు కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. టీకాపై అవగాహన కల్పించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రముఖులను రంగంలోకి దింపింది. అప్పుడు ప్రజలకు నమ్మకం పెరిగింది.
- ఆ తర్వాత ప్రజలు టీకా కోసం ఎగబడ్డారు(india vaccination rate ). దీంతో టీకా కేంద్రాల్లో భారీ క్యూలు కనిపించేవి. దీని వల్ల దేశవ్యాప్తంగా టీకా కొరత ఏర్పడింది. వినియోగం పెరగడం, దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ల ఉత్పత్తి జరగకపోవడం వల్ల పరిస్థితులు కష్టంగా మారాయి. దీంతో రాష్ట్రాల అభ్యర్థనల మేరకు టీకా ఉత్పత్తి సంస్థలకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించి, నిధులు అందించి టీకా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం కృషి చేసింది.
- టీకా పంపిణీ ప్రక్రియకు అసలైన జోష్ ఇచ్చింది మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు అనే చెప్పుకోవాలి. సెప్టెంబర్ 17న వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమం పెద్ద ఉద్యమంగా సాగింది. ఆ ఒక్క రోజే 2కోట్లకుపైగా మందికి టీకా అందడం విశేషం.
- దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. 10కోట్ల మార్కును అందుకునేందుకు 85రోజులు పట్టింది. 20కోట్ల మార్కును 45రోజుల్లో, 30కోట్ల మార్కును 29రోజుల్లో దాటేసింది. ఆ తర్వాత టీకా పంపిణీలో భారత్ దూసుకుపోయింది. 24 రోజుల తర్వాత 40కోట్ల డోసులు, 20రోజుల అనంతరం ఆగస్టు 6న 50కోట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం 76రోజుల్లోనే 100కోట్ల మార్కును అందుకుంది. దేశంలోని 75శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారు. 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్టు సమాచారం.
- 100కోట్ల డోసుల పంపిణీపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ కరోనా విజృంభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం అంటున్నారు.
- దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. జైడస్ క్యాడిలా టీకాకు అనుమతులు లభించాయి. చిన్నారులకు ఇచ్చే టీకాపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది భారత్. ఇందుకోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. కొత్త టీకాలకు అనుమతులిస్తోంది.
- దేశంలోనే కాకుండా.. వీదేశాలకూ టీకాలు పంపిణీ చేస్తోంది భారత్. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ ఫార్మా రంగానికి పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతోంది.
ఇదీ చూడండి:- చరిత్ర సృష్టించిన భారత్.. టీకా పంపిణీ@100కోట్లు