ETV Bharat / bharat

Kerala Covid Cases: కేరళలో 19వేలకుపైగా కొత్త కేసులు - tamil nadu corona cases

కేరళలో కొత్తగా 19,653 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 3,413 కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఎలా ఉందంటే..?

kerla covid cases
కేరళలో కరోనా కేసులు
author img

By

Published : Sep 19, 2021, 9:32 PM IST

Updated : Sep 19, 2021, 10:59 PM IST

కేరళలో కరోనా కేసులు (Kerala Covid Cases) స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 19,653 మందికి వైరస్ సోకింది. మరో 26,711 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45.08 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 23,591 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో వైరస్ సోకే వారి రేటు(వీక్లీ ఇన్​ఫెక్షన్ పాపులేషన్ రేషియో) 10 కంటే ఎక్కువగా నమోదయ్యే జిల్లాలో ఆంక్షలు కఠినతరం చేయనున్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో కఠిన లాక్​డౌన్​ విధించనున్నట్లు చెప్పింది.

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 3,413 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 49 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 65,21,915కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,518కి పెరిగింది.

మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో 28 మందికి వైరస్​ సోకింది. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

వివిధ రాష్ట్రాల్లో కేసులు..

  • కర్ణాటకలో కొత్తగా 783 కేసులు నమోదయ్యాయి. 1,139 మంది కోలుకోగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో 1,697 కరోనా కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,594 మంది వైరస్​ను జయించారు.
  • ఒడిశాలో కొత్తగా 623 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో ఏడుగురు మృతిచెందారు.
  • గుజరాత్​లో ఈ ఏడాదిలో తొలిసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 కంటే తక్కువకు పడిపోయింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 15 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: COVID-19: గాలి ద్వారా వ్యాపించేలా కరోనా రూపాంతరం

ఇదీ చదవండి: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ.. 2-10 ఏళ్ల వారికి...

Last Updated : Sep 19, 2021, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.