ETV Bharat / bharat

'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్​ డోసులు కష్టం' - కొవిడ్​ కేసులు కేరళ

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం కేసులు కేరళ నుంచే వస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో ఆర్​-ఫ్యాక్టర్​ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. బూస్టర్​ డోసుల పంపిణీపై చర్చలు జరుపుతున్నామని.. డబ్ల్యూహెచ్​ఓ తాత్కాలిక నిషేధం విధించడం వల్ల ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తెలిపింది.

health ministry on covid cases, కరోనా కేసులు తాజా
'దేశంలో 50 శాతం కేసులు ఆ రాష్ట్రం నుంచే..'
author img

By

Published : Aug 10, 2021, 5:26 PM IST

Updated : Aug 10, 2021, 10:52 PM IST

దేశవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో 50 శాతానికి పైగా కేరళలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేరళలో నమోదైనవి 51.51శాతంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఆగస్టు 20లోగా మరో 4.6 లక్షల కొవిడ్​ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

కేరళ, తమిళనాడు సహా 9 రాష్ట్రాల్లోని 37 జిల్లాల్లో గత రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది.

పాజిటివిటీ రేటు పెరుగుతోంది..

11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 44 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ నమోదు అవుతోందని తెలిపింది. కొవిడ్​ వ్యాప్తిని సూచించే ఆర్​-ఫ్యాక్టర్​ (రిప్రొడక్షన్ ఫ్యాక్టర్​)​ సంఖ్య పంజాబ్​, గుజరాత్​, మధ్యప్రదేశ్, హిమాచల్​ ప్రదేశ్​లో ఒకటి కన్నా ఎక్కువ ఉందని తెలిపింది. కొవిడ్​ వ్యాప్తి నెమ్మదిస్తున్నా.. ఈ సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.

'దేశంలో కొత్తగా 28,204 కేసులు నమోదయ్యాయి. గత 147 రోజుల్లో ఇదే అతితక్కువ సంఖ్య' అని కేంద్రం పేర్కొంది.

డెల్టాప్లస్​ వేరియంట్లు..

దేశంలో ఇప్పటివరకు 86 డెల్టాప్లస్​ వేరియంట్లను గుర్తించినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. ఏవై1, ఏవై2, ఏవై3 సహా మహారాష్ట్రలో మరో వేరింట్​ను గుర్తించామని తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 34 నమూనాల్లో ఈ వేరింట్​ను కనుగొన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్​ (11), తమిళనాడు (10) ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ రకం వైరస్​ వేగంగా విస్తరిస్తున్నట్లు ఆధారాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. బీ.1.617.3, కప్పా వేరియంట్లపై కూడా ఇన్సాకాగ్​ పరిశోధనలు సాగిస్తోందని తెలిపింది.

బూస్టర్​ డోసు..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్​ డోసు పంపిణీ చేయాల్సిన అవసరంపై కేంద్రం స్పందించింది. బూస్టర్​ డోసు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని.. ఇటీవల ఇందుకు సంబంధించి చర్చలు జరిపామని పేర్కొంది. బూస్టర్​ డోసులపై డబ్ల్యూహెచ్​ఓ తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో తదుపరి చర్యల గురించి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : 8 ఏళ్ల బాలుడు.. అర్ధరాత్రి సైకిల్​పై 92 కి.మీ... చివరకు...

Last Updated : Aug 10, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.