కేరళలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 19,622 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 132మంది మృతి చెందారు. 22,523 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
అటు మహారాష్ట్రలో కొత్తగా 3,741 కేసులు నమోదయ్యాయి. మరో 52 మంది మరణించారు. 4,696 మంది కోలుకున్నారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,523 మంది మహమ్మారి బారినపడ్డారు. 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 973 కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది చనిపోయారు.
- మిజోరంలో 440 మందికి వైరస్ సోకింది. వారిలో 88 మంది చిన్న పిల్లలు ఉన్నారు.
- జమ్ముకశ్మీర్‌లో 105, పుదుచ్చేరిలో 63, గోవాలో 59, నాగాలాండ్‌లో 31, పంజాబ్‌లో 27, దిల్లీలో 20, గుజరాత్లో 12, హరియాణాలో 10, మధ్యప్రదేశ్‌లో 10 కరోనా కేసులు వెలుగు చూశాయి.
64 కోట్లు మార్క్ దాటిన టీకా పంపిణీ..
దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం రికార్డు వేగంతో దూసుకుపోతుంది. సోమవారం మరో 53 లక్షల మందికి టీకా డోసులు వేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 64 కోట్లకు చేరింది.
ఇదీ చూడండి: covid variant: 'దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు'