భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరో వెయ్యి మందిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు కేరళ పోలీసులు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభల్లో పాల్గొన్న ఇతర భాజపా నేతలపేర్లు ప్రస్తావించిన పోలీసులు.. వారిపైనా కేసు పెడతామన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేరళలో పర్యటిస్తున్నారు నడ్డా. ఈ నేపథ్యంలో త్రిస్సూర్ జిల్లాలోని టెక్కిన్కాడ్ మైదానంలో భాజపా శ్రేణులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన.. కేరళపై కేంద్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు పూడ్చడానికి.. రూ.19,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఈ సభకు భారీగా హాజరైన భాజపా శ్రేణులు.. కరోనా నిబంధనలను మరిచారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈమేరకు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: జాతీయ జెండా కప్పినందుకు ఎఫ్ఐఆర్