ETV Bharat / bharat

రాజ్యాంగంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. లైట్ తీసుకోమన్న అధికార పార్టీ! - కేరళ మంత్రి రాజ్యాంగం వివాదం

Kerala minister constitution: భారత రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని ఆరోపించారు కేరళ మంత్రి సాజి చెరియన్​. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశాయి. ఈ వాదనను అధికార సీపీఎం తోసిపుచ్చింది.

kerala minister constitution
kerala minister constitution
author img

By

Published : Jul 5, 2022, 4:02 PM IST

Updated : Jul 5, 2022, 7:10 PM IST

Kerala minister constitution: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ మత్స్యకార​, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్. రాజ్యాంగం దోపిడీని సమర్థిస్తూ, దేశ ప్రజలను మోసం చేసే విధంగా రాశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు.. మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశాయి.

మంత్రి ఏమన్నారు?
మల్లపల్లిలో జరిగిన రాజకీయ కార్యక్రమానికి హాజరైన చెరియన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని మంత్రి విమర్శించారు. ఈ కారణంతోనే దేశంలో కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. బ్రిటీష్ వారు సంకలనం చేసిన రాజ్యాంగాన్ని ఓ భారతీయుడు రాశారని.. దానినే 75 ఏళ్లుగా అమలు చేస్తున్నామన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటివి వాటిలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో ఎవరు దీనికి విరుద్ధంగా చెప్పినా తాను అంగీకరించబోనని మంత్రి చెరియన్​ స్పష్టం చేశారు.

"మనం రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించుకున్నామని చెప్పుకుంటాం. ఇది భారత దేశానికే ప్రత్యేకమైనదని చెబుతాం. కానీ ఈ రాజ్యాంగాన్ని అత్యధిక ప్రజలను దోచుకునే విధంగా రాశారు."

- సాజి చెరియన్​, కేరళ మంత్రి

మంత్రి చెరియన్​ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్​, భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మంత్రిని వెంటనే కేబినెట్​​ నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ఆయన దానిని కించపరిచారని ప్రతిపక్ష నేత సతీశన్​ అన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్​ మాట్లాడుతూ.. మంత్రి చెరియన్​కు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని గౌరవించరనే విషయం చెరియన్​ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని విమర్శించారు.

విచారం వ్యక్తం చేసిన మంత్రి: తాను ప్రజా సేవకుడినని.. రాజ్యాంగాన్ని తానెంతో గౌరవిస్తానని చెప్పారు మంత్రి సాజి చెరియన్. రాజ్యాంగాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే.. మంత్రి సాజి చెరియన్​ను బర్తరఫ్​ చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్​ను అధికార సీపీఎం తోసిపుచ్చింది. పొరపాటున నోరు జారారని వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: 'నుపుర్'కు మద్దతుగా సీజేఐకి మాజీ జడ్జిల లేఖ.. సుప్రీం వ్యాఖ్యలపై అసంతృప్తి

Last Updated : Jul 5, 2022, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.