దేశంలోనే తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కేరళ అంకురార్పణ చేసింది. వివిధ రకాల డ్రోన్లను గుర్తించే సామర్థ్యంతో దీనికి రూపకల్పన చేసింది. డ్రోన్ పూర్తిగా ధ్వంసమైనప్పటికీ.. వాటి అవశేషాలను బట్టి డ్రోన్ ఏ రకానికి చెందినదనే విషయాన్ని ఈ ల్యాబ్ గుర్తిస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో ఈ ల్యాబ్‌ను ఆవిష్కరించారు.
దేశవ్యతిరేక కార్యకలాపాల కోసం డ్రోన్ల వినియోగం పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇలాంటి ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. శాంతి భద్రతల నిర్వహణ కోసం డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు కేరళ పోలీసు విభాగం ప్రయత్నిస్తోందని తెలిపారు.
కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న సైబర్ డోమ్ కార్యక్రమంలో భాగంగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. డ్రోన్ మెమోరీని విశ్లేషించి.. అవి ఎలాంటి రకానికి చెందినవనే విషయాన్ని ఈ ల్యాబ్ గుర్తిస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ డేటాను బట్టి.. వాటిని ఎందుకోసం ఉపయోగిస్తున్నారనే విషయాలనూ అంచనా వేస్తుంది.
ఇదీ చదవండి: 'పఠాన్‌కోట్ దాడికి స్థానిక పోలీసుల సాయం'!