న్యాయ్ పథకం ద్వారా కేరళలోని పేదలకు ప్రతినెల రూ.6వేల అందిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. యూడీఎఫ్ కూటమి విప్లవాత్మకమైన, ఇదివరకు దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాన్ని ప్రతిపాదించిందన్నారు. వయనాడ్ నియోజకవర్గంలోని తిరునెళ్లిలో ఆదివారం పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
'కేరళలోని పేదలకు ప్రతినెల రూ.6000 చొప్పున ఏడాదికి రూ.72వేలు అందిస్తాము. ఈ డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తాము' అని రాహుల్ స్పష్టం చేశారు.
తిరునెళ్లి పర్యటన సందర్భంగా స్థానిక మహావిష్ణు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు రాహుల్. అనంతరం కల్పెట్ట ప్రాంతంలోని జీవన్ జ్యోతి అనాథాశ్రమంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో పలువురు బాలికలు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రాతో వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు.
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడతాయి.
ఇదీ చదవండి: విజయన్ చరిత్ర సృష్టిస్తారా?