కొవిడ్ మహమ్మారి కారణంగా అనుకోని పరిస్థితుల్లో బాల రైతుగా మారాడు కేరళకు చెందిన మ్యాథ్యూ బెన్నీ. 13 ఏళ్లకే పదమూడు ఆవులను చూసుకుంటూ.. పశువుల పెంపకంలో తనదైన ముద్రవేస్తున్నాడు.
ఇడుక్కి జిల్లా తోడుపుళ గ్రామానికి చెందిన మ్యాథ్యూ తండ్రి గతేడాది అనారోగ్య సమస్యలతో మరణించాడు. దీనితో పశువుల పెంపకంపైనే ఆధారపడిన మ్యాథ్యూ కుటుంబం కష్టాల్లో పడింది. ఈ ఘటనతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలను స్వీకరించాడా బాలుడు.



భవిష్యత్తులో పశువైద్యుడు కావాలని కలలుగంటున్న మ్యాథ్యూ.. వెట్టిమట్టంలోని విమల పబ్లిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పశువైద్యునిగా సేవ చేస్తూ.. తన కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకోవాలనేదే తన కోరిక అని చెబుతున్నాడు.


ఇవీ చదవండి: