కర్ణాటక రాయచూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కేరళకు చెందిన గీత టి.వి. ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటింది. స్నాతకోత్సవంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ చేతులమీదుగా ఈ మెడల్స్ అందుకుంది. ఈమె సొంతూరు మలప్పురం జిల్లా వాండూర్ గ్రామం. తండ్రి కే సురేశ్ కుమార్ ఓ సాధారణ ఆటోడ్రైవర్. తల్లి గృహిణి (kerala auto driver daughter).
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 303 మంది డిగ్రీ విద్యార్థులు, 107 పీజీ, 26 పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు పొందారు. వీరిలో డిగ్రీలో 21 మంది, పీజీలో 14 మంది, పీహెచ్డీలో 10 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరందరికీ గవర్నర్ మెడల్స్ ప్రదానం చేశారు.
అనంతరం ఈటీవీ భారత్తో మాట్లాడింది గీత. తాను కేరళకు చెందిన విద్యారినిని అయినప్పటికీ కర్ణాటకలో చదువుకున్నానని చెప్పింది. ఉపాధ్యాయులు, స్నేహితుల నుంచి గొప్ప సహకారం లభించిందని, వారి మద్దతుతోనే ఈ మెడల్స్ సాధించినట్లు పేర్కొంది. తల్లిదండ్రులు ఎల్లవేళలా అండగా నిలిచారని వారికి కృతజ్ఞతలు చెప్పింది(Auto driver daughter news).
పీహెచ్డీ పూర్తి చేసి అగ్రికల్చర్ కాలేజ్లో లెక్చరర్ కావడమే తన లక్ష్యమని గీత చెప్పింది.
ఇదీ చదవండి: బుల్ ఫెస్టివల్లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..