Kashmir Encounter: కశ్మీర్లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ శనివారం జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్లోని చౌగామ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
![kashmir encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14005286_encounter.jpg)
![kashmir encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14005286_jammu.jpg)
![kashmir encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14005286_kashmir.jpg)
మృతిచెందిన ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వెల్లడించారు పోలీసులు. వీరిలో ఒకరు ఇదివరకే అనేక సార్లు ప్రజలపై దాడులకు పాల్పడగా.. మరొకరు ఇటీవల సంస్థలో చేరినట్లు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 'దేశం పేరు చెప్పినప్పుడు గర్వంగా అనిపించింది'