Kashi Tamil Sangamam 2023 : ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావనను కాశీ తమిళ సంగమం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించగానే ఈ భావన కనిపిస్తుందని చెప్పారు. అధికారిక మార్పిడికి గుర్తుగా భావించే సెంగోల్‌ను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించామని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఏర్పాటు చేసిన కాశీ తమిళ సంగమం 2.0 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తమిళనాడు, కాశీ ప్రజల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకమైనదని తెలిపారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంగా ఏర్పడి ఈ కాశీ-తమిళ సంగమాన్ని విజయవంతం చేయడాన్ని ప్రశంసించారు.
-
VIDEO | "I am happy that the Banaras Hindu University and IIT Madras have collaborated to make the Kashi Tamil Sangamam a success. The IIT Madras has started the 'Vidya Shakti' initiative to help students from Kashi in maths and science. These things show that the relationship… pic.twitter.com/9SQz9e1gUW
— Press Trust of India (@PTI_News) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "I am happy that the Banaras Hindu University and IIT Madras have collaborated to make the Kashi Tamil Sangamam a success. The IIT Madras has started the 'Vidya Shakti' initiative to help students from Kashi in maths and science. These things show that the relationship… pic.twitter.com/9SQz9e1gUW
— Press Trust of India (@PTI_News) December 17, 2023VIDEO | "I am happy that the Banaras Hindu University and IIT Madras have collaborated to make the Kashi Tamil Sangamam a success. The IIT Madras has started the 'Vidya Shakti' initiative to help students from Kashi in maths and science. These things show that the relationship… pic.twitter.com/9SQz9e1gUW
— Press Trust of India (@PTI_News) December 17, 2023
కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తొలిసారిగా కృత్రిమ మేధతో భాషను తర్జుమా చేసే 'భాషిణి' విధానాన్ని ఉపయోగించారు. దీని ద్వారా ప్రధాని మోదీ హిందీలో చేసిన ప్రసంగాన్ని అక్కడి తమిళ శ్రోతలు తమ మాతృభాషలో విన్నారు. అంతకుముందు వారణాసి నుంచి కన్యాకుమారి వరకు నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 17 నుంచి 30 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి సుమారు 1,400 మంది అతిథులు హాజరయ్యారు.
-
Today in Prime Minister Narendra Mod's speech at Kashi Tamil Sangamam in Varanasi, simultaneous Artificial Intelligence based Tamil translation was done through Bhashini for those in the audience who understood Tamil. pic.twitter.com/2Ou6ool2qA
— ANI (@ANI) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today in Prime Minister Narendra Mod's speech at Kashi Tamil Sangamam in Varanasi, simultaneous Artificial Intelligence based Tamil translation was done through Bhashini for those in the audience who understood Tamil. pic.twitter.com/2Ou6ool2qA
— ANI (@ANI) December 17, 2023Today in Prime Minister Narendra Mod's speech at Kashi Tamil Sangamam in Varanasi, simultaneous Artificial Intelligence based Tamil translation was done through Bhashini for those in the audience who understood Tamil. pic.twitter.com/2Ou6ool2qA
— ANI (@ANI) December 17, 2023
కాన్వాయ్‌ను పక్కకు మళ్లించి అంబులెన్స్‌కు దారి
మరోవైపు, తన కాన్వాయ్‌ను పక్కకు మళ్లించి అంబులెన్స్‌కు దారి ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. ఓవైపు రోడ్‌షో కొనసాగుతుండగా అటువైపుగా అంబులెన్స్ రావడం గుర్తించిన మోదీ, భద్రతా అధికారులకు కాన్వాయ్‌ను రోడ్డు పక్కకు మళ్లించాలని సూచించారు. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీనిపై ప్రధానిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని అంబులెన్స్‌కు ఇలా దారి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్, హిమాచల్‌ప్రదేశ్ పర్యటన సందర్భంగా మోదీ తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారి ఇచ్చారు.
-
#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his roadshow in Varanasi.
— ANI (@ANI) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On his 2-day visit to Varanasi, PM Modi will launch and inagurate 37 projects worth more than Rs 19,000 crore for Varanasi and Purvanchal. He will also launch… pic.twitter.com/NPZgLumo55
">#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his roadshow in Varanasi.
— ANI (@ANI) December 17, 2023
On his 2-day visit to Varanasi, PM Modi will launch and inagurate 37 projects worth more than Rs 19,000 crore for Varanasi and Purvanchal. He will also launch… pic.twitter.com/NPZgLumo55#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his roadshow in Varanasi.
— ANI (@ANI) December 17, 2023
On his 2-day visit to Varanasi, PM Modi will launch and inagurate 37 projects worth more than Rs 19,000 crore for Varanasi and Purvanchal. He will also launch… pic.twitter.com/NPZgLumo55
ప్రపంచ వజ్రాల కేంద్రంగా భారత్- సూరత్ డైమండ్ మార్కెట్ ఒక మోదీ గ్యారంటీ! : ప్రధాని మోదీ
ప్రాచీన సంస్కృతి పునరుద్ధరణే లక్ష్యంగా.. కాశీ తమిళ సంగమ కార్యక్రమం