మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న కారణంతో తల్లి, సోదరిపై కాల్పులు జరిపి, హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో(Karnataka Uttara Kannada News) జరిగింది.
మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్(19)గా అధికారులు గుర్తించారు. "పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్(24).. కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి సాంబార్ విషయంలో తల్లి, సోదరితో అతడు ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు" అని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చికెన్ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త!
ఇదీ చూడండి: 'చికెన్ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!