Corona positive students in Karnataka: కర్ణాటక చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా సోకిన వారిలో 90మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్ ఉన్నారు. అయితే వారిలో ఎవరికీ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం మొత్తం 69 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. సోమవారం మరో 32 మందికి పాజిటివ్‌గా తెలినట్లు అధికారులు తెలిపారు. వారందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు చిక్కమంగళూరు జిల్లా ఆరోగ్య అధికారి ఉమేశ్ తెలిపారు.
ఇదీ చూడండి: ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!