దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. మహారాష్ట్ర, కేరళలో కాస్త కేసులు తగ్గుముఖం పట్టగా.. కర్ణాటకలో కొత్తగా 41,779 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 373 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మహారాష్ట్రలో కొత్తగా 39,923 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా 695 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు..
- కేరళలో కొత్తగా 34,694 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 93 మంది మృతిచెందారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈనెల 23 వరకు పొడిగిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వైరస్ ఉద్ధృతంగా ఉన్న ఎర్నాకుళం, తిరువనంతపురం, త్రిస్సూర్, మలప్పురంలో త్రిపుల్ లాక్డౌన్ విధించారు.
- తమిళనాడులో కొత్తగా 31, 892 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్‌తో మరో 288 మంది మరణించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 15, 747 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో మరో 312 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొత్తగా 8,506 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ కారణంగా మరో 289 మంది మరణించారు.
- హరియాణాలో మరో 10, 608 కేసులు, 164 మరణాలు నమోదయ్యాయి.
- ఉత్తరాఖండ్‌లో 5,775 మందికి కరోనా నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 116 మంది మరణించారు.
- మధ్యప్రదేశ్‌లో మరో 8, 087 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ మరో 88 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 14,289 మందికి వైరస్ సోకింది. మరో 155 మంది మరణించారు.
- గోవాలో కొత్తగా 2,455 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 61 మంది మృతిచెందారు.
- మిజోరంలో కొత్తగా 201 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మరో వారం రోజులపాటు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి : పిల్లలకు కరోనా టీకా ఎప్పుడు?