ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆంక్షలు.. న్యూ ఇయర్ వేడుకలు రద్దు

Karnataka Omicron Restrictions: రాష్ట్రంలో కొవిడ్​-19 వ్యాప్తి, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

author img

By

Published : Dec 21, 2021, 5:40 PM IST

Karnataka Restrictions
రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆంక్షలు

Karnataka Omicron Restrictions: ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది. అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది.

" రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నాం. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి."

-- బసవరాజు బొమ్మై, కర్ణాటక సీఎం

భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది.

వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.