ETV Bharat / bharat

Karnataka IT Raid Today : ఆ కాంట్రాక్టర్‌ ఫ్యామిలీ ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.50కోట్లు సీజ్‌!

Karnataka IT Raid Today : కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ సహా ముగ్గురి ఇలాఖాల్లో 3 రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా డబ్బు, పలు పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సోదాల్లో 50 కోట్లకుపైగా నగదు చిక్కినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రెండు మౌలిక సదుపాయాల కంపెనీలకు చెందిన 25 చోట్ల గురువారం మొదలైన దాడులు శుక్రవారం సాయంత్రం వరకు 45 చోట్లకు విస్తరించాయని పేర్కొన్నారు.

Karnataka IT Raid Today
కర్ణాటక ఐటీ రైడ్స్​
author img

By PTI

Published : Oct 15, 2023, 9:09 PM IST

Karnataka IT Raid Today : కర్ణాటకలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరిపారు అధికారులు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల జరిపిన సోదాల్లో జరిపారు. అనంతరం భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌, అతడి కుమారుడు, జిమ్‌ యజమాని, ఆర్కిటెక్ట్‌ సహా పలువురి ఇళ్లల్లో సోదాలు జరిపి.. రూ.50కోట్లకు పైగా నగదు సీజ్‌ చేశారు. రెండు ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలకు సంబంధించి గురువారం 25 చోట్ల ఈ సోదాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికి అవి 45 ప్రదేశాలకు చేరినట్లు వారు వెల్లడించారు.

పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు సహకారనగర్, సంజయ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంస్థల్లో సోదాల ఆధారంగా లభ్యమైన సమాచారం ఆధారంగా పలువురు కాంట్రాక్టర్లు, ఇతర వ్యక్తుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. శనివారం వరకు మొత్తంగా 45చోట్ల సోదాలు నిర్వహించారు. ఒక్కరోజులోనే ఒక ఆర్కిటెక్ట్‌, జిమ్‌ యజమాని ఇళ్లల్లో సోదాలు జరిపి.. రూ.8కోట్లు నగదను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సీజ్ చేసిన నగదు మొత్తంగా రూ.50కోట్లకు చేరిందని ఐటీ అధికారులు తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు వారు వెల్లడించారు.

గత బీజేపీ సర్కార్‌పై 40శాతం కమీషన్‌ ఆరోపణలు చేసిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ ఇంటిపై.. ఈ ఐటీ దాడులు జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సీటీ రవి.. లంచాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి నీటి కనెక్షన్ కూడా నిరాకరించిన సందర్భం కూడా ఉందని ఆయన తెలిపారు. చదరపు అడుగుకు రూ.100 చొప్పున లంచం ఇవ్వాలని అడుగుతున్నారని సీటీ ఆరోపించారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Bangalore IT Raid Today : ఎన్నికల ఎఫెక్ట్​.. కార్పొరేటర్ల ఇళ్లల్లో IT సోదాలు​.. మంచం కింద రూ.42 కోట్లు చూసి షాక్​!

IT Raids On DMK MP Jagathrakshakan : డీఎంకే ఎంపీపై ఐటీ నజర్.. ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో సోదాలు.. వెయ్యి మంది పోలీసులతో వెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.