వేర్వేరు దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించింది. ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది.
"కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ వ్యాప్తిని పరిగణించి.. కేంద్రం, సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాము. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సాగే ఈ కర్ఫ్యూ జనవరి 2 వరకు ఉంటుంది. ప్రజలు ఇందుకు సహకరించి ఈ వైరస్ వ్యాప్తిని నివారించాలి."
-బీఎస్ యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
72 గంటల్లోపే...
విదేశాలను నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని, ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విమానాశ్రయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు యధావిధిగా కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పిన కొన్ని గంటలే ఈ నిబంధనలను అమలు చేయడం గమనార్హం.
ఇదీ చూడండి : 'మోదీ జీ... మనకు టీకా వచ్చేది ఎప్పుడు?'