ETV Bharat / bharat

కొత్త వేరియంట్​పై కర్ణాటక అలర్ట్​- కొవిడ్ రోగులకు 7 రోజులు హోమ్​ ఐసోలేషన్ తప్పనిసరి! - కర్ణాటక కరోనా ఐసోలేషన్

Karnataka Covid Home Isolation : కొవిడ్ సోకిన వారికి ఏడు రోజులు హోమ్​ ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. అలాగే ప్రజలందరూ మాస్క్​లు, భౌతిక దూరం వంటి తదితర జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కొవిడ్​ కేసుల పెరుగుదల, కొత్త JN.1 కేసులు గుర్తిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఒక్క రోజు వ్యవధిలో దేశంలో 702 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Karnataka Covid Home Isolation
Karnataka Covid Home Isolation
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 10:15 AM IST

Updated : Dec 28, 2023, 12:26 PM IST

Karnataka Covid Home Isolation : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో పాజిటివ్​ రోగులకు ఏడు రోజుల హోమ్​ ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. మంగళవారం ఒక్కరోజులోనే 74 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశమైన కర్ణాటక క్యాబినెట్​ సబ్​ కమిటీ, ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించరాదని చెప్పింది. కొవిడ్ కేసుల పెరుగుదల, JN.1 వేరియంట్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, ఏడు రోజుల హోమ్​ ఐసోలేషన్ వంటివి పాటించాలని సూచించింది. కర్ణాటక ఆరోగ్య విభాగం విడుదల చేసిన హెల్త్​ బులిటెన్ ప్రకారం బుధవారం నాటికి 464 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. కొవిడ్ పాజిటివ్​ నిర్ధరణ అయివారిని హోమ్​ ఐసోలేషన్​లో ఉంచారు. వారి ఆరోగ్యాన్ని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Covid Cases In India Today : దేశంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 702 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. దీంతో క్రీయాశీల కేసుల సంఖ్య 4,097కి చేరిందని చెప్పింది. మొత్తం ఆరుగురు (మహారాష్ట్ర(2), కర్ణాటక (1), కేరళ (1), బంగాల్​ (1), దిల్లీలో ఒకరు మృతిచెందారని తెలిపింది.

అయితే డిసెంబరు 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గింది. కొత్త వేరియంట్, చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా కొవిడ్​ కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ ప్రకారం కొవిడ్​ వైరస్​ బారి నుంచి 4.4 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ టీకాలు వేశారు. మరోవైపు, బుధవారం దిల్లీలో మొదటి జేఎన్​.1 వేరియంట్ కేసు నమోదైంది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

JN.1 Cases In India : JN.1 అనేది ఒమిక్రాన్​ సబ్​ వేరియంట్​. దీన్ని BA.2.86 లేదా పిరోలా అని పిలుస్తారు. ఈ JN.1 వేరియంట్ మొదటి కేసు కేరళలో నమోదైంది.

ఉస్మానియాలో ఇద్దరు మృతి - వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధరణ

దేశంలో మరో 529 మందికి కరోనా- జేఎన్​.1 కేసులు @ 109

Last Updated : Dec 28, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.