ETV Bharat / bharat

గవర్నర్​ను కలవనున్న యడ్డీ- రాజీనామా కోసమేనా? - థావర్ చంద్ గహ్లోత్

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆ రాష్ట్ర గవర్నర్​ను నేడు కలవనున్నారు. రాజీనామా ఊహాగానాలు ఊపందుకున్న వేళ గవర్నర్​ అపాయింట్​మెంట్​ను సీఎం కోరడంపై ఆసక్తి నెలకొంది.

bsy resign news
గవర్నర్​ను కలవనున్న యడ్
author img

By

Published : Jul 26, 2021, 7:34 AM IST

కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్​​ను కలిసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన గవర్నర్ కార్యాలయానికి వెళ్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి.

గవర్నర్​ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయమే అభ్యర్థన పంపిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీనికి గవర్నర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న గహ్లోత్.. సోమవారం అపాయింట్​మెంట్ ఇచ్చారని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. విధాన సౌధలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం తన సన్నిహితులైన మంత్రులతో యడియూరప్ప భేటీ కానున్నారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాజ్​భవన్​కు వెళ్తారని వివరించారు.

రాజీనామానా? కాదా?

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల మధ్య యడియూరప్ప గవర్నర్​ను కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా చేస్తున్నట్లు యడ్డీ ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్​తో సమావేశం అనంతరం రాజీనామా ప్రకటన చేస్తారా? లేదా ఇది సాధారణ సమావేశమేనా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి:

కమల దళం.. కుర్చీలాట

యడియూరప్పపై నడ్డా ప్రశంసలు.. ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.