ETV Bharat / bharat

తల్లి చదివిన స్కూల్​కు హైటెక్​ హంగులు.. రూ.2కోట్లతో కొత్త భవనం - కర్ణాటక వార్తలు

businessman donates 2 crores to school: తన తల్లి చదువుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హైటెక్​ సొబగులు అద్దారు బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త. రూ.2 కోట్లు ఖర్చు చేసి కొత్త భవనం నిర్మించటం సహా.. స్మార్ట్​ క్లాసులు, కంప్యూటర్ల వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.

businessman donates
తల్లి చదివిన స్కూల్​కు హైటెక్​ హంగులు
author img

By

Published : Apr 23, 2022, 9:31 PM IST

Businessman Donates: కర్ణాటక బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన తల్లి జ్ఞాపకార్థం ఆమె చదువుకున్న ప్రభుత్వ సీనియర్​ సెకండరీ పాఠశాలకు భారీగా విరాళం ఇచ్చారు. రూ.2 కోట్లతో 14 గదుల భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠాశాలకు హైటెక్​ హంగులు అద్దారు.

businessman donates
రూ.2 కోట్లతో నిర్మించిన కొత్త భవనం

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హర్ష.. బిజినెస్​ పనిమీద వెళ్తూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కోరా గ్రామాన్ని సందర్శించారు. అది తన అమ్మమ్మ వాళ్ల ఊరు. తన తల్లి సర్వమంగళ నాగయ్య చదువుకున్న పాఠశాలకు వెళ్లారు. జాతీయ రహదారి విస్తరణ కోసం పాఠశాల భవనంలో కొంత భాగాన్ని కూల్చివేసిన విషయాన్ని తెలుసుకున్నారు. దానిని చూసి చలించిపోయిన హర్ష.. గ్రామ పెద్దలు, అధికారులను కలిసి మాట్లాడారు. తన తల్లి జ్ఞాపకార్థం కొత్త భవనం నిర్మించేందుకు కావాల్సిన డబ్బులు తాను ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ భూమిలో సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి 14 గదులతో కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత రోజులకు తగినట్లుగా స్మార్ట్​ క్లాస్​రూమ్​లు ఏర్పాటు చేశారు. వ్యాపార వేత్త హర్షను ఈటీవీ భారత్​ సంప్రదించగా పలు విషయాలు వెల్లడించారు.

businessman donates
వ్యాపారవేత్త హర్ష

"నేను బెంగళూరులో ఉంటాను. మా తల్లిగారు సర్వమంగళ నాగయ్య ఈ గ్రామంలోనే జన్మించారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారు. వివాహం తర్వాత బెంగళూరుకు వెళ్లారు. ఈ గ్రామం కోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ప్రస్తుతం 14 గదుల భవనం నిర్మించి కంప్యూటర్​లు, స్మార్ట్​ క్లాస్​ రూమ్​లు ఏర్పాటు చేశాం. అంతకు ముందు గ్రామస్థులు, పంచాయతీ అధ్యక్షుడిని కలిసి మాట్లాడాను. నా కలను నిజం చేసుకునేందుకు వారంతా అంగీకరించారు. అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేశాం."

- హర్ష, వ్యాపారవేత్త

ప్రస్తుతం పాఠశాలలో కంప్యూటర్​ గది, స్మార్ట్​ క్లాస్ ​రూమ్​ వంటి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పాఠశాలకు నూతన భవనం నిర్మించిన హర్ష దంపతులపై గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కొత్త భవనాన్ని ప్రారంభించి పాఠశాలకు అప్పగించారు.

businessman donates
నూతన భవనం

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ సిలబస్​లో 'ప్రజాస్వామ్యం' చాప్టర్ కట్.. ఇంకా ఎన్నో..

టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.