ETV Bharat / bharat

నాడు కర్ణాటక సర్కారు కూలడానికి అదే కారణమా? - జేడీఎస్‌

కర్ణాటకలో గత కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా పెగాసస్ హ్యాకింగ్​ టా​ర్గెట్ జాబితాలో ఉన్నట్లు ప్రముఖ వార్త సంస్థ ది వైర్​ పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ హ్యాకింగ్‌ వ్యవహారానికి సంబంధముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

pegasus hit list
పెగాసస్‌
author img

By

Published : Jul 20, 2021, 10:33 PM IST

దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న 'పెగాసస్‌' హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహా పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లు ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు 'ది వైర్‌' వార్తా సంస్థ వెల్లడించగా.. తాజాగా మరిన్ని వివరాలను బయటపెట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా టార్గెట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ హ్యాకింగ్‌ వ్యవహారానికి సంబంధముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2019 జులైలో కర్ణాటకలో కాంగ్రెస్ ‌- జేడీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే తాజాగా 'ది వైర్‌' వెల్లడించిన కథనంలో.. అప్పటి కర్ణాటక డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శుల ఫోన్‌ నంబర్లు స్పైవేర్‌ లక్షిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. వీరితో పాటు కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్ల పైనా నిఘా పెట్టినట్లు తెలిపింది. దీంతో ఈ హ్యాకింగ్‌ ద్వారానే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి ఉంటుందనే సందేహాలు వెలువడుతున్నాయి.

2019లో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 17 మంది శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో కుమారస్వామి సర్కారు బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. అప్పట్లో కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాషాయ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను భాజపా కొట్టిపారేసింది.

ఇవీ చదవండి: 'ఫోన్ల ట్యాపింగ్​'పై మాటల యుద్ధం

ఫోన్​ హ్యాకింగ్​ జాబితాలో రాహుల్​, ప్రశాంత్​ కిశోర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.