Karimnagar Politics Telangana Assembly Election 2023 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ధార్మిక, రాజకీయ, పారిశ్రామిక అంశాలతోపాటు.. కాళేశ్వరం జలాలతో.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉండగా.. 31,12,283 మంది ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. 27,88,085 మంది ఉండగా.. ఐదేళ్లలోనే 3,24,198 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరిలో అధిక శాతం యువతే. కొత్తగా ఓటు హక్కును పొందిన యువత.. ఎటు మొగ్గు చూపుతుందోననే చర్చ సాగుతోంది.
రాజకీయ చైతన్యానికి కేరాఫ్‌లా కనిపించే నియోజకవర్గం కరీంనగర్. 2009 నుంచి వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన గంగుల.. గత ఎన్నికల్లో బండి సంజయ్‌పై(MP Bandi Sanjay) 14వేల ఓట్ల మెజారిటీతో(Majority of votes) గెలిచారు. నాలుగోసారి పోటీ చేస్తున్న గంగులకు.. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీనిస్తున్నారు. కీలకంగా మారే మైనార్టీ ఓట్లతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి చీల్చే ఓట్లపై.. గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. గతంలో కమలాపూర్‌గా ఉండి 2009 డీలిమిటేషన్‌లో భాగంగా ఏర్పడిన నియోజకవర్గం హుజురాబాద్. 2004 నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఈటల రాజేందర్.. బీజేపీలోనూ అదే టెంపో కొనసాగిస్తున్నారు.
Karimnagar Political Vibes in Assembly Elections : గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వొడితల ప్రణవ్‌బాబు పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీ కారణంగా ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. మానకొండూరు నియోజకవర్గం 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో(Redistribution of constituencies) భాగంగా ఎస్సీ రిజర్వుడ్‌గా ఉంది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్.. బీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీజేపీ ఛార్జ్‌షీట్
మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీజేపీ నుంచి.. కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రసమయికి పోటీగా బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్‌లోని ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో చొప్పదండి ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. కారు పార్టీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగగా.. కమలం తరఫున అభ్యర్థిగా బోడిగె శోభ, కాంగ్రెస్ నుంచి మేడిపల్లి సత్యం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో పునర్విభజన తర్వాత ఇందుర్తి.. హుస్నాబాద్ నియోజకవర్గంగా(Husnabad Constituency) మారింది. రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సతీష్ కుమార్.. హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar).. సతీష్‌కు పోటీ ఇస్తున్నారు.
Election Campaigns of Karimnagar Political Parties : చాళుక్యుల పరిపాలించిన గడ్డ వేములవాడను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేశ్‌బాబు అడ్డాగా మార్చుకున్నారు. పౌరసత్వ వివాదం కారణంగా ఆయన స్థానంలో బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మినర్సింహారావు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ తనకే పట్టం కట్టాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉరిశాల నుంచి సిరిశాలగా మారుతున్న నియోజకవర్గం 'సిరిసిల్ల'. ఉపాధి లేక నేతన్నల ఆర్తనాదాలు ఆత్మహత్యలతో మార్మోగిన సిరిసిల్ల దశదిశ మార్చేందుకు నడుం కట్టిన నేత కేటీఆర్(Minister KTR). మరోసారి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. నియోజకవర్గంలో బలమైన పద్మశాలి సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం పార్టీ వేట కొనసాగిస్తోంది. బీజేపీ నుంచి రాణిరుద్రమరెడ్డి బరిలో ఉన్నారు. వ్యవసాయం, పరిశ్రమ సమ్మిళితం పెద్దపల్లి నియోజకవర్గం. గత రెండు పర్యాయాలుగా ఇక్కడి నుంచి గెలుపొందిన ట్రినిటి విద్యా సంస్థల ఛైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన చింతకుంట విజయ రమణారావు.. హోరాహోరీ తలపడుతున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష.. బహుజనవాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
Karimnagar Political News : రామగుండం నియోజకవర్గం.. పరిశ్రమలకు నిలయం. గత మూడు దఫాలుగా భిన్నమైన ఫలితాలు వచ్చాయి. రామగుండంలో ప్రధాన పార్టీల కంటే స్వతంత్ర అభ్యర్ధులే(Independent Candidates) గెలిచిన చరిత్ర ఎక్కువ. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత శాసనసభ్యుడు కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, కమలం నుంచి కందుల సంధ్యారాణి, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు అవకాశమివ్వని సింగరేణి కార్మికులు.. ఈసారి ఎవరికి పట్టం కడుతుందని చర్చ జరుగుతోంది.
వేద భూమి, జ్ఞాన భూమిగా పేరొందిన నాటి మంత్రపురి.. నేటి మంథని నియోజకవర్గం. కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు, బీజేపీ నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి బరిలో ఉన్నారు. లక్ష్మీనరసింహస్వామి కొలువైన నియోజకవర్గం ధర్మపురి. ఈ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు సార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈసారి ఐదో విజయం కోసం సై అంటున్నారు. నిను వీడను నీడను నేను అంటూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. కొప్పులను ఢీ కొడుతున్నారు. బీజేపీ నుంచి ఎస్.కుమార్ పోటీలో నిలిచారు. ధర్మపురిలో జరగబోయేది ధర్మ యుద్ధమని అధికార ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ.. రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Telangana Assembly Elections 2023 :జగిత్యాల అంటేనే చైతన్యం. రాజకీయ భీష్ముడి వంటి జీవన్‌రెడ్డి.. జగిత్యాలను కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చుకున్నారు. కానీ గత ఎన్నికల్లో.. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత స్వయంగా రంగంలోకి దిగి.. జగిత్యాలలో గులాబీ జండా ఎగిరెలా చేశారు. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్‌కుమార్, బీజేపీ నుంచి బోగ శ్రావణి బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు(Three Major Parties) నువ్వా నేనా అంటూ.. పోరాటాన్ని రక్తి కట్టిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న అసమ్మతి సెగ-మూడో జాబితా ప్రకటనతో చెలరేగిన ప్రకంపనలు
కోరుట్ల నియోజకవర్గంలో.. ఈసారి హేమాహేమీల వారసులు బరిలో ఉన్నారు. 2009 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ నుంచి నాలుగుసార్లు గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఈసారి తనయుడు డాక్టర్ సంజయ్‌ను బరిలో నిలిపారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కుమారుడు నర్సింగరావు, కమలం పార్టీ నుంచి డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గట్టి పోటీనిస్తున్నారు. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టువదలని విక్రమార్కులు - ఒక్క ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం - ఆ ఆయుధాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు : కేసీఆర్