కర్ణాటక ఆవిర్భావ దినోత్సవ(karnataka formation day 2021) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కర్ణాటక విధాన సభ వద్దకు వచ్చిన వందల మంది ప్రజలు కన్నడ పురాణాలకు చెందిన పాటలు ఆలపించారు. నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవం (karnataka rajyotsava day) సందర్భంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
కర్ణాటక సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెల్లవారుజాము నుంచే ఔత్సాహికులు రావడం విశేషం. ఇక హుబ్లీలోని కన్నడ భవన్‌లో నిర్వహించిన 'లక్ష కంఠ గీతాయన' కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి(karnataka cm news) బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా వేదికల్లో ఈ కార్యక్రమాన్ని(karnataka rajyotsava) నిర్వహించామని.. ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: