యువ నాయకులు కన్నయ్య కుమార్(బిహార్)(Kanhaiya kumar congress), జిగ్నేష్ మేవాని (గుజరాత్)(Jignesh Mevani Congress) త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పనిచేసిన కన్నయ్య కుమార్ గత లోక్‌సభ ఎన్నికల ముందు సీపీఐలో చేరారు. బిహార్‌లోని బెగుసరాయి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
దిల్లీలో ఈ నెల 28న కన్నయ్య కుమార్(Kanhaiya kumar congress) కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మేవాని(Jignesh Mevani Congress) అదే రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని వడ్‌గాం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా దళిత నాయకుడు చరణ్ జీత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ నియమించిన నేపథ్యంలో.. ఇప్పుడు జిగ్నేష్ చేరిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీ చూడండి: