Kambala Festival : కర్ణాటకలో కంబళ పోటీల సందడి మొదలైంది. కోస్తా కర్ణాటక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ పోటీలను.. మొదటిసారిగా బెంగళూరులో నిర్వహిస్తున్నారు. 'బెంగళూరు కంబళ - నమ్మ కంబళ' పేరుతో రెండు రోజులపాటు సాగనున్న ఈ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 200కిపైగా దున్నలతో జరుగుతున్న ఈ పోటీలు సోమవారంతో ముగియనున్నాయి.
ఏంటీ కంబళ పోటీలు?
కంబళ పోటీలు ఓ జానపద క్రీడ మాత్రమే కాదు.. కర్ణాటక తీరప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే ఆట. దీనిని ఎక్కువగా కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అక్కడి ప్రజలు దీనిని ఓ పండగలా జరుపుకుంటారు. అయితే ఈసారి ఈ పోటీలకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ వేదిక కావడం విశేషం.
-
#WATCH | Karnataka: 'The Buffalo Race- Kambala' was held at Palace Grounds in Bengaluru for the second day. pic.twitter.com/LXKIDZ1ceh
— ANI (@ANI) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Karnataka: 'The Buffalo Race- Kambala' was held at Palace Grounds in Bengaluru for the second day. pic.twitter.com/LXKIDZ1ceh
— ANI (@ANI) November 26, 2023#WATCH | Karnataka: 'The Buffalo Race- Kambala' was held at Palace Grounds in Bengaluru for the second day. pic.twitter.com/LXKIDZ1ceh
— ANI (@ANI) November 26, 2023
ఇదీ ప్రత్యేకత!
పోటీల్లో పాల్గొనే దున్నలకు రెండునెలల ముందే ప్రత్యేకంగా శిక్షణను ఇస్తారు. అంతేకాకుండా వాటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం రోజూ బీన్స్, క్యారెట్లు, బాదం పప్పు సహా వివిధ రకాల కూరగాయలతో పాటు ఎండుగడ్డిని ఆహారంగా తినిపిస్తారు. వీటి(దున్నల) శరీరాన్ని చల్లగా ఉంచేందుకు గుమ్మడికాయలను కూడా ఆహారం కింద అందిస్తారు. అంతేకాకుండా వారానికి మూడు సార్లు వాకింగ్, రన్నింగ్‌కు తీసుకువెళ్తారు. దీంతో పాటు నూనెతో బాడీ మసాజ్ చేస్తారు. చిన్నపాటి కొలనులు, చెరువుల్లో వీటికి ఈత నేర్పించి ప్రత్యేకంగా తర్ఫీదునిప్పిస్తారు.
-
Capturing the heart-pounding speed and grace of Kambala buffalos (kona) at Namma Kambala Bengaluru – a vibrant celebration of tradition and culture! 🌟
— Karnataka Tourism (@KarnatakaWorld) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
VC 🎥: @mr_alemari#kambala #Bengaluru #nammakarnataka #BengaluruKambala #karnataktourism #Karnataka pic.twitter.com/IkRbKNg1Ar
">Capturing the heart-pounding speed and grace of Kambala buffalos (kona) at Namma Kambala Bengaluru – a vibrant celebration of tradition and culture! 🌟
— Karnataka Tourism (@KarnatakaWorld) November 26, 2023
VC 🎥: @mr_alemari#kambala #Bengaluru #nammakarnataka #BengaluruKambala #karnataktourism #Karnataka pic.twitter.com/IkRbKNg1ArCapturing the heart-pounding speed and grace of Kambala buffalos (kona) at Namma Kambala Bengaluru – a vibrant celebration of tradition and culture! 🌟
— Karnataka Tourism (@KarnatakaWorld) November 26, 2023
VC 🎥: @mr_alemari#kambala #Bengaluru #nammakarnataka #BengaluruKambala #karnataktourism #Karnataka pic.twitter.com/IkRbKNg1Ar
ప్రత్యేకంగా జాకీలు..!
ఈ పోటీల్లో పాల్గొనే దున్నలతో పాటు ఓ వ్యక్తి(జాకీ) కూడా పరిగెత్తుతాడు. దున్నలను నియంత్రిస్తూ వేగంగా రేసును పూర్తి చేయడం వీరి లక్ష్యం. వీరు కూడా వాటి(దున్నల) సామర్థ్యానికి తగ్గట్లు ప్రత్యేక శిక్షణ, ఆహారం తీసుకుంటారు. ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. అయితే వీరికి అంతకుముందు కంబళ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి. వారిని మాత్రమే జాకీలుగా తీసుకుంటారు. ఇలాంటి జాకీలను తయారు చేయడానికి దక్షిణ కన్నడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, పోటీలు ప్రారంభం కంటే ముందు రెండు జంట దున్నలను చెక్కతో చేసిన ఓ వస్తువుకు కట్టేస్తారు. అనంతరం దానిని క్షేత్రంలోకి దింపుతారు.
దున్న పళ్ల ఆధారంగా బరిలోకి..
కంబళ పోటీల్లో పాల్గొనే దున్నల పళ్ల సంఖ్య ఆధారంగా కూడా వాటిని ఏ కేటగిరీలో పోటీకి దింపాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు పందెం నిర్వాహకులు. దీనికోసం ముందుగా వాటి(దున్నల) పళ్లను లెక్కిస్తారు. రెండు నుంచి ఆరు పళ్లు ఉన్న దున్నలను జూనియర్ విభాగంలో.. ఆరు కంటే ఎక్కువ పళ్లు ఉన్న దున్నలను సీనియర్ విభాగంలో పోటీ పడేందుకు అనుమతిస్తారు. అయితే జంటగా పోటీ పడేందుకు ఒక్కోసారి తమ దగ్గర రెండో దున్న అందుబాటులో లేకపోతే యజమానులు.. దాని స్థానంలో ఇతర జట్టులోని దున్నను అరువుగా తీసుకొని మరీ పరుగు పందెంలోకి దింపుతారు.
లగ్జరీ దున్నలు..!
కంబళ పోటీల్లో పాల్గొనే ముందు దున్నలకు ప్రత్యేకంగా వేడి చేసిన నీటిలో స్నానం చేయిస్తారు. ఆపై గడ్డిని ఆహారంగా పెడతారు. అనంతరం వాటి శరీరంపై క్రిమికీటకాలు వాలకుండా కొబ్బరి నూనెతో మర్దన చేస్తారు. ఆపై పోటీల్లో విజేతగా నిలిచేందుకు ప్రతి దున్న జట్టుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పరుగు పందెంలో గెలవడం, బంగారు పతకం సాధించడం కంటే.. వాటిని పోటీల కోసం బలిష్ఠంగా తయారు చేయడాన్నే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారట దున్నల యజమానులు. అయితే ఈ దున్నల నిర్వహణకు నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని యజమానులు అంటున్నారు.
ఫుల్ డిమాండ్..!
ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి వరకు కంబళ సీజన్‌గా పిలుస్తారు. ఈ కాలానికి రెండు నెలల ముందు నుంచే కంబళ పోటీల కోసం దున్నలను సిద్ధం చేస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే దున్నలకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
గుజరాత్లో అకాల వర్షాలు- పిడుగులు పడి 20 మంది మృతి
100 గంటల్లో కార్మికుల వద్దకు! రంగంలోకి ఆర్మీ- వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభం