ETV Bharat / bharat

'భాజపా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్​ బేరసారాలు' - కమల్​నాథ్​

భాజపా ఎమ్మెల్యేలతో కాంగ్రెస్​ సహా ఆ పార్టీ సీనియర్​ నేత కమల్​నాథ్​ బేరసారాలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్న తరుణంలో చౌహాన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Kamal Nath, Cong trying to lure BJP MLAs: MP CM
'భాజపా ఎమ్మెల్యేలతో కమల్​నాథ్​ బేరసారాలు'
author img

By

Published : Nov 7, 2020, 8:55 PM IST

మధ్యప్రదేశ్​లో అధికార భాజపా- విపక్ష కాంగ్రెస్​ మధ్య మరోమారు మాటల యుద్ధం నెలకొంది. 28 అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు.. ఈ నెల 10న వెలువడనున్న తరుణంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్​నాథ్​ నుంచి ఫోన్లు వస్తున్నాయని.. వారితో బేరసారాలు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ మండిపడ్డారు.

"భాజపా ఎమ్మెల్యేలను కాంగ్రెస్​- కమల్​నాథ్​ సంప్రదిస్తున్నారు. వారికి ఎరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బేరసారాలు ఆడుతున్నారు. వాటితో ఎలాంటి లాభం లేదు. మధ్యప్రదేశ్​ రాజకీయాలను కమల్​నాథ్​ భ్రష్టు పట్టించారు."

-- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ సీఎం.

కాంగ్రెస్​ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న కమల్​నాథ్​ ఆరోపణల నేపథ్యంలో చౌహాన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది తొలినాళ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి, 25మంది ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచుకున్నారు. ఫలితంగా ఖాళీ ఏర్పడ్డ 25స్థానాలతో పాటు మరో మూడు సీట్లకు ఈ నెల 3న ఉపఎన్నికలు జరిగాయి.

ఇదీ చూడండి:- కమల్​నాథ్​ అనుచిత వ్యాఖ్యలపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.