ETV Bharat / bharat

జర్నలిస్ట్​ మహ్మద్‌ జుబైర్‌ అరెస్ట్​ - Alt News co founder Mohammad Zubair was arrested

Mohammad Zubair: జర్నలిస్ట్​ మహ్మద్‌ జుబైర్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Journalist Mohammad Zubair arrested in Delhi
మహ్మద్‌ జుబైర్‌ అరెస్ట్​
author img

By

Published : Jun 27, 2022, 10:02 PM IST

Journalist Mohammad Zubair arrest: జర్నలిస్ట్‌, ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ ‘ఆల్ట్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ జుబైర్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్‌ 153, సెక్షన్‌ 295ఏ కింద కేసు నమోదు చేశారు. జుబైర్‌ అరెస్ట్‌ను ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ధ్రువీకరించారు.

2020 నాటి కేసుకు సంబంధించి ఇవాళ దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారని, అయితే ఆ కేసులో అరెస్ట్‌ చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉందని తెలిపారు. దీంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్ట్‌ చేశారని, దానికి సంబంధించి ముందస్తు నోటీసులు గానీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీ గానీ తమకు ఇవ్వలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: శిందే వర్గానికి సుప్రీంలో ఊరట.. అప్పటివరకు పదవులు సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.