ETV Bharat / bharat

సింగిల్‌ డోస్‌ టీకా: భారత్‌లో ప్రయోగాలకు సిద్ధం?

author img

By

Published : Apr 10, 2021, 5:26 AM IST

జాన్సన్​ అండ్​ జాన్సన్ సంస్థ భారత్​లో టీకా ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాము అభివృద్ధి చేసిన సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​కు అనుమతుల కోసం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

johnson and johnson single dose vaccine trials in india
సింగిల్‌ డోస్‌ టీకా: భారత్‌లో ప్రయోగాలకు సిద్ధం?

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారత్‌లోనూ టీకా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుతున్నట్లు వెల్లడించింది. అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

66శాతం సమర్థత..

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ 66శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే తేలింది. తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు ఆ సంస్థ తెలిపింది. సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44వేల మందిపై జరిపారు. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ 72శాతం, లాటిన్‌ అమెరికా దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లో 57శాతం సమర్థత కనబరిచిందని జే&జే ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్‌ మరణాల నుంచి వందశాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. భారత్‌లో విదేశీ టీకా అనుమతి పొందాలంటే మాత్రం ఇక్కడ తప్పనిసరిగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే స్పుత్నిక్‌ ఇప్పటికే ప్రయోగాలు పూర్తిచేయగా తాజాగా జే&జే కూడా సిద్ధమవుతోంది.

స్పుత్నిక్‌ టీకా: మరింత సమాచారం ఇవ్వండి..!

రష్యా అభివృద్ధి కరోనా టీకా ‘స్పుత్నిక్‌-వీ’ వినియోగ అనుమతి కోసం ఇప్పటికే డాక్టర్‌ రెడ్డీస్‌ భారత ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇదివరకే నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. అయితే, ఈ టీకాను అనుమతించేందుకు మరింత ప్రయోగాల సమాచారం కావాలని భారత్‌లో ప్రయోగాలు నిర్వహిస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ను కేంద్ర నిపుణుల కమిటీ కోరినట్లు సమాచారం. దీంతో దేశంలో స్పుత్నిక్‌ టీకా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రష్యాకు చెందిన రష్యన్‌ డైరక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ టీకాను ఉత్పత్తి చేసి భారత్‌లో విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెండు, మూడో దశ ప్రయోగాలను డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహించింది. ఈ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి అందజేసింది. రెడ్డీస్‌ ఇచ్చిన ప్రయోగ సమాచారాన్ని విశ్లేషించేందుకు మార్చి 31వ తేదీన నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. విశ్లేషణ అనంతరం ప్రయోగాలకు సంబంధించిన మరింత సమాచారం అందిచాలని డాక్టర్‌ రెడ్డీస్‌ కోరినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.