ETV Bharat / bharat

భారత్​కు జో బైడెన్​ కొత్తేమీ కాదు: జైశంకర్​ - 'జో బైడెన్ భారత్‌కు కొత్త కాదు..'

భారత్‌-అమెరికా సత్సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జై శంకర్‌. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే జో బైడెన్ పాలనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన భారత్​కేమీ కొత్త కాదని అన్నారు.

Joe Biden is Not A Stranger To India, says Jaishankar
'జో బైడెన్ భారత్‌కు కొత్త కాదు..'
author img

By

Published : Nov 18, 2020, 9:33 PM IST

వచ్చే ఏడాది జో బైడెన్‌ అధ్యక్షుడిగా అగ్రరాజ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కష్టసాధ్యమేమీ కాదని భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జై శంకర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ భారత దేశానికేమీ కొత్త కాదని ఆయన వివరించారు.

ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో జై శంకర్‌ మాట్లాడుతూ.. 2000లో బిల్‌ క్లింటన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని, దానిలో బైడెన్‌ భాగస్వామ్యం కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను భారత రాయబారిగా ఉన్నానని జై శంకర్‌ తెలిపారు. బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అంతకు ముందు సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ సభ్యుడిగా, ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో కలసి పనిచేశామని జైశంకర్ వెల్లడించారు.

గత అధ్యక్షులందరూ..

క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌ తదితరుల రూపంలో అమెరికాకు విభిన్న వ్యవహార శైలి గల అధ్యక్షులు లభించారని, అయితే వారందరూ భారత్‌తో సత్సంబంధాలను కొనసాగించిన వారే అని మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్‌ గానీ ఇరుదేశాల వ్యవహారాలు గానీ జో బైడెన్‌కు కొత్త కాదన్నారు. ఆయన ప్రభుత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతం కాగలవని విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల మాదిరిగానే భారత్‌-అమెరికా సంబంధాలు ప్రస్తుతమున్న స్థితి నుంచి మరింత ముందుకు సాగగలవని జై శంకర్‌ అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.