JNU violence: శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వసతి గృహంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటం వల్ల హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలపారు. మరోవైపు.. 60 మంది వరకు గాయపడ్డారని రెండు వర్గాలు ప్రకటించాయి. పరస్పరం ఘర్షణకు దిగిన వామపక్ష అనుబంధ జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్, ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ).. తమపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించుకున్నాయి.
కావేరీ హాస్టల్ మెస్‌లో నవరాత్రి పూజ నిర్వహంచారు పలువురు విద్యార్థులు. మాంసాహారాన్ని వడ్డించొద్దని మెస్ సూపర్వైజర్కు చెప్పారు. నిబంధనల ప్రకారం వామపక్ష సంఘ విద్యార్థులకు మాంసహారం వడ్డించారు మెస్ సిబ్బంది. మాంసాహారం వడ్డింటంపై ఇరు గ్రూప్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. చిలికిచిలికి గాలివానగా మారి రాళ్లు రువ్వుకునేదాకా వెళ్లింది.
మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఏబీవీపీ.. రామ నవమి వేడుకలు జరగకుండా వారే తమను అడ్డుకున్నారని తెలిపారు. పలువురు విద్యార్థులు ఈ అంశంపై వర్సిటీ వైస్ ఛాన్సిలర్‌కు ఫిర్యాదు చేశారు. జేఎన్‌యూలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు.
-
ABVP hooligans stopped residents inside JNU from having non Veg food
— Aishe (ঐশী) (@aishe_ghosh) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ABVP also assaulted the mess secretary of the Hostel.
Unite against the hooliganism unleashed by ABVP inside campus premises.https://t.co/3MpRE9zXn4 pic.twitter.com/Fy3HU7qg8J
">ABVP hooligans stopped residents inside JNU from having non Veg food
— Aishe (ঐশী) (@aishe_ghosh) April 10, 2022
ABVP also assaulted the mess secretary of the Hostel.
Unite against the hooliganism unleashed by ABVP inside campus premises.https://t.co/3MpRE9zXn4 pic.twitter.com/Fy3HU7qg8JABVP hooligans stopped residents inside JNU from having non Veg food
— Aishe (ঐশী) (@aishe_ghosh) April 10, 2022
ABVP also assaulted the mess secretary of the Hostel.
Unite against the hooliganism unleashed by ABVP inside campus premises.https://t.co/3MpRE9zXn4 pic.twitter.com/Fy3HU7qg8J
ఇదీ చూడండి: కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!