ETV Bharat / bharat

డ్రోన్​ ఉందా? పోలీస్ స్టేషన్​లో అప్పగించాల్సిందే! - శ్రీనగర్​లో డ్రోన్లు బ్యాన్

జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)​ సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం కలకలం సృష్టించిన నేపథ్యంలో శ్రీనగర్​ జిల్లా కలెక్టర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిధిలో డ్రోన్లు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు.

drones, ban
డ్రోన్లు బ్యాన్, శ్రీనగర్
author img

By

Published : Jul 4, 2021, 5:35 PM IST

జమ్ముకశ్మీర్​లోని వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి(Drone attack) తర్వాత పలుమార్లు సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్(Jammu and Kashmir)​ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్​లో డ్రోన్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈమేరకు జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఎజాజ్.. శ్రీనగర్​లో డ్రోన్​ సంబంధిత కార్యకలాపాలు జరిపితే కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. డ్రోన్​ సరఫరా, అమ్మకం మొదలైన వాటిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:సరిహద్దులో మరోసారి డ్రోన్ల కలకలం

జిల్లా పరిధిలో జరిగే సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో డ్రోన్ల వాడకం తప్పనిసరిగా నిలిపివేయాలని ఎజాజ్​ తెలిపారు. సరిహద్దుల్లో వైమానిక స్థావరం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

డ్రోన్​ సంబంధిత వస్తువులు ఉన్నవారు.. స్థానిక పోలీసు స్టేషన్లలో వాటిని పొందుపరచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాచరణకు డ్రోన్లను వినియోగించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి:డ్రోన్ల ముప్పుపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఈ నెల 27న జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ తర్వాత వరుసగా జమ్ములోని మూడు ప్రాంతాల్లో డ్రోన్ల సంచారం కలకలం రేపింది. భారత్‌కు చెందిన కీలక స్థావరాలపై డ్రోన్ల ద్వారా పాకిస్థాన్‌ దాడులకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:Jammu IAF Station: డ్రోన్‌ కౌంటర్‌ వ్యవస్థ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.