ETV Bharat / bharat

రైలు ఢీకొని నలుగురు మృతి- ట్రాక్​ దాటుతుండగా ప్రమాదం - Jharkhand Train Accident

Jharkhand Train Accident : ఝార్ఖండ్​లోని సెరైకెలా జిల్లాలో ఘోరం జరిగింది. పట్టాలు దాటుతున్న నలుగురు పాదచారులను ఉత్కల్​ ఎక్స్‌ప్రెస్​ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Jharkhand Train Accident
Jharkhand Train Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 8:56 PM IST

Updated : Jan 18, 2024, 9:20 PM IST

Jharkhand Train Accident : పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్​ సెరైకెలా-ఖర్స్వాన్​ జిల్లాలోని గమ్హారియా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటనను రైల్వే అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

'పొగమంచు కారణంగానే ప్రమాదం' : ఉత్కల్​ ఎక్స్‌ప్రెస్​ రైలు టాటానగర్​ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలో దట్టమైన పొగమంచు అలుముకున్నట్లు వారు చెప్పారు. ఈ క్రమంలోనే పట్టాలు దాటుతున్న నలుగురు ప్రయాణికులను రైలు ప్రమాదవశాత్తు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాలు ట్రాక్​పైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తోటి ప్రయాణికులు పేర్కొన్నారు.

ఇక ఈ ప్రమాద ఘటనపై టాటానగర్​ ఆర్‌పిఎఫ్​ విభాగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాక్​పై పడి ఉన్న మృతదేహాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటన రైల్వే పోల్ నెం.260/20 సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.

Last Updated : Jan 18, 2024, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.