ETV Bharat / bharat

లాలూకు మళ్లీ నిరాశే.. బెయిల్​ పిటిషన్​ కొట్టివేత - lalu yadav bail petition news

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్‌ పిటిషన్​ను​ తిరస్కరించింది ఝార్ఖండ్​ హైకోర్టు. ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్​ పొందిన లాలు.. డుమ్కా ఖజానా కేసులో బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు.

Jharkhand HC rejects Lalu Yadav's bail plea in fodder scam case
లాలూ బెయిల్​ పిటిషన్​ను కొట్టేసిన ఝార్ఖండ్​ హైకోర్టు
author img

By

Published : Feb 19, 2021, 5:43 PM IST

Updated : Feb 19, 2021, 7:29 PM IST

పశువుల దాణా కుంభకోణంలో భాగమైన డుమ్కా ఖజానా కేసులో ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్‌ పిటిషన్​ను తిరస్కరించింది ఝార్ఖండ్ హైకోర్టు. లాలు మరో రెండు నెలలు జైలులో ఉన్నట్లయితే సగం శిక్షాకాలం పూర్తవుతుందని ధర్మాసనం తెలిపింది. ఆ తర్వాత కొత్త పిటిషన్‌ వేయాలని సూచించింది.

ఈ కుంభకోణంలో భాగంగా నాలుగు కేసులకు గానూ ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్​ పొందిన లాలు.. డుమ్కా ట్రెజరీ కేసులోనూ బెయిల్​ వస్తుందని భావించారు. కానీ.. కోర్టులో చుక్కెదురైంది.

లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్‌ అఫిడవిట్‌, లాలూ జ్యుడీషియల్‌ కస్టడీ పత్రాలను సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కోర్టుకు అందించింది.

ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.

ఇవీ చూడండి:

లాలూ విడుదల కోరుతూ.. రాష్ట్రపతికి 50 వేల లేఖలు

నిలకడగా లాలూ ఆరోగ్యం.. ప్రైవేటు వార్డుకు మార్పు

Last Updated : Feb 19, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.