ETV Bharat / bharat

జామపండ్ల కోసం చెట్టెక్కి ప్రాణాల మీదకు - బాలుడి శరీరంలో గుచ్చుకున్న ఇనుపకడ్డీలు

జామ పండ్లను తెంపేందుకు చెట్టు ఎక్కిన ఓ బాలుడు.. అనుకోకుండా కాలు జారి కింద పడ్డాడు. దీంతో కింద ఉన్న ఇనుప కడ్డీలు అతడి శరీరంలో దిగాయి. గాయపడ్డ బాలుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Iron rods entered in A child body
బాలుడి శరీరంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీలు
author img

By

Published : Oct 22, 2021, 7:57 PM IST

జామపండ్లను తినాలని ఆశపడ్డ ఓ బాలుడి పరిస్థితి ప్రాణాపాయంగా మారింది. చెట్టుపై నుంచి కిందపడగా... ఇనుప కడ్డీలు అతడి శరీరంలో గుచ్చుకున్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్ ధన్​బాద్​లో(Jharkhand Dhanbad News) జరిగింది.

ధన్​బాద్​ జిల్లాలోని(Jharkhand Dhanbad News) ఆసన్​బానీ గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు.. శుక్రవారం తన ఇంటి సమీపంలోని ఓ జామ చెట్టు ఎక్కాడు. అయితే.. అనుకోకుండా కాలు జారి కింద ఉన్న ఇనుప కడ్డీలపై పడ్డాడు. దాంతో మూడు ఇనుప కడ్డీలు అతడి శరీరంలోకి గుచ్చుకున్నాయి. స్థానికులు వాటిని కత్తిరించి, ధన్​బాద్​లోని ఎస్​ఎన్​ఎంసీఎహెచ్​ ఆస్పత్రికి బాలుడిని తరలించారు. అక్కడ బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. బాధిత బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Iron rods entered in A child body
బాలుడి శరీరంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీలు
Iron rods entered in A child body
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
Iron rods entered in A child body
బాలుడి పరిస్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన స్థానికులు

బాధిత బాలుడి తండ్రి చాలా కాలం క్రితమే మరణించాడని స్థానికులు తెలిపారు. తల్లి ఒక్కతే అతడి ఆలనా పాలనా చూసుకుంటోందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని చూసేందుకు ఆస్పత్రికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. వారంతా బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: భవనంలో అగ్నిప్రమాదం.. 19వ అంతస్తు నుంచి పడి..

ఇదీ చూడండి: 3 నెలల మనవడిని హత్య చేసిన అమ్మమ్మ.. ఆపై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.