జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు (JEE MAIN RESULTS) నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారిక వెబ్సైట్లో నుంచి స్కోర్‌కార్డ్ (JEE score card), ర్యాంక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు జేఈఈ అడ్వాన్స్డ్, ఐఐటీ ఎంట్రెన్స్ రిజిస్ట్రేషన్ల (JEE advanced registration) ప్రక్రియ సైతం నేడు ప్రారంభం కానుంది.
పరీక్ష వాయిదా పడటం సహా.. జేఈఈ స్కామ్‌కు సంబంధించి సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఫలితాలు (JEE main result 2021) ఆలస్యమవుతున్నాయి.
అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది
మెయిన్స్ పరీక్షను వేర్వేరు షిఫ్టుల్లో నిర్వహించినందున.. స్కోర్ల శాతం ఆధారంగా ఫలితాలను నార్మలైజేషన్ (JEE mains normalisation score) చేయనుంది. మెయిన్స్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
దేశంలోని 23 ఐఐటీలలో ఇంజినీరింగ్, సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులలో చేరేందుకు (IIT admission) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఇదీ చదవండి: