ETV Bharat / bharat

JEE Advanced Exam Mass Copying In Hyderabad : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మాస్ కాపీయింగ్‌.. ఎలా జరిగిందంటే.. - జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష

JEE MASS COPYING
JEE MASS COPYING
author img

By

Published : Jun 6, 2023, 5:55 PM IST

Updated : Jun 6, 2023, 7:39 PM IST

17:49 June 06

JEE Advanced Exam Mass Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నాపత్రాలు.. వాట్సాప్ గ్రూప్​లో ప్రత్యక్షం

JEE Advanced Exam HI Tech Copy In Hyderabad : ఓ కార్పోరేట్ కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్​లో అర్హత సాధించారు. ఆ తర్వాత అడ్వాన్స్​డ్​లోనూ మంచి మార్కులు సాధించాలని కలలు కన్నారు. దీనికోసం అడ్డదారిని ఎంచుకున్నారు. ఎస్సెస్సీతో పాటు, ఇంటర్​లోనూ ఎక్కువ మార్కులు సాధించడంతో పాటు, జేఈఈ మెయిన్స్​లోనూ ప్రతిభ కనబర్చిన విద్యార్థి సాయం తీసుకోవాలని ప్రణాళిక రచించారు. స్నేహితులు అడగడంతో సదరు విద్యార్థి కూడా అంగీకరించాడు. ఐదుగురు ఇంటర్ విద్యార్థులు కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తమకు వచ్చిన సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ముందే ప్రణాళిక.. అనుసరించిన వ్యూహం : దీనికోసం మొబైల్స్​ను పరీక్షా కేంద్రంలోకి ఎలా తీసుకెళ్లాలనే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారు. హాల్​లోకి వెళ్లే సమయంలో తనిఖీ ఉంటుంది కాబట్టి ముందే ఫోన్​లను లోపలికి తీసుకెళ్లేలా ఆలోచించారు. అందరు విద్యార్థులకంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలో మొబైళ్లను ఉంచారు. పరీక్షా ప్రారంభమయ్యే కంటే అర్ధగంట ముందు సెంటర్​లోకి చేరుకున్నారు. ఆ తర్వాత మొబైల్​ను ఆవరణలో నుంచి తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా మూత్రశాలలో దాచారు. పరీక్ష ప్రారంభమయ్యే ముందే మూత్రశాలకు వెళ్లి మొబైల్ ను తమ వెంట తెచ్చుకున్నారు. ఆ తర్వాత సమాధానాలను ఒకరికొకరు చేరవేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్విజిలెటర్ కు దొరికిపోయారు.

Smart Copying in JEE Advanced Exam : నాచారంలోని అయాన్ డిజిటల్ సెంటర్ లో రెండు పరీక్షా కేంద్రాలున్నాయి. కూకట్ పల్లికి చెందిన అన్నదమ్ములు ఆ రెండు సెంటర్లలో పరీక్ష రాశారు. 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష జరిగింది. ఓ విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్లు ఇన్విజిలేటర్ ఉదయం 11గంటల సమయంలో గుర్తించారు. వెంటనే పరిశీలకుడికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విద్యార్థి ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తేలింది. అందులో ఐదుగురు విద్యార్థులున్నట్లు గుర్తించారు. విద్యార్థి సోదరుడు పక్కనే ఉన్న మరో సెంటర్​లో పరీక్ష రాస్తున్నట్లు తేల్చిన పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సోదరులిద్దరూ ఇచ్చిన సమాచారం ప్రకారం మిగతా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాస్తున్న సెంటర్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు.

Hitech Copying in JEE Exam : సికింద్రాబాద్​లోని ఎస్వీఐటీ, మౌలాలీ, ఎల్బీనగర్​లలో ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష రాసిన ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని వాళ్ల మొబైల్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. నాచారం పీఎస్​లో సోదరులిద్దరిపైన, సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ లో ఓ విద్యార్ధిపై, ఎల్బీనగర్ ఓ విద్యార్థిపై, మల్కాజ్ గిరిలో మరో విద్యార్థిపై పోలీసులు చూచిరాత కింద కేసు నమోదు చేసి 41ఏ సీఆర్పీసీ నోటీసులిచ్చారు. 3 రోజుల్లో సమాధానాలివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐదుగురు విద్యార్థులపైనా చూచిరాత కింద కేసు నమోదు చేయడంతో వాళ్ల చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మార్కులు సంపాందించాలనే కోరికతో చూచిరాతకు పాల్పడి జేఈఈ కలను చెరిపేసుకున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 6, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.