ETV Bharat / bharat

JDU జాతీయ అధ్యక్షుడిగా నీతీశ్​ కుమార్​

JDU New President Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లలన్​ సింగ్ ఆ పదవి నుంచి వైదొలిగి నీతీశ్ కుమార్​ పేరును ప్రతిపాదించారు. ఇందుకు జేడీయూ జాతీయ కార్యవర్గం ఆమోదం తెలిపింది.

jDU New president
jDU New president
author img

By PTI

Published : Dec 29, 2023, 12:54 PM IST

Updated : Dec 29, 2023, 6:28 PM IST

JDU New President Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఇందుకు వేదికైంది. నీతీశ్​ కుమార్ జేడీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఆ పార్టీ నాయకుడు కేసీ త్యాగి తెలిపారు.
ఇప్పటివరకు జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న లలన్​ సింగ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తదుపరి సారథిగా జాతీయ కార్యవర్గ సమావేశంలో నీతీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. కార్యవర్గంలోని సభ్యులు ఇందుకు అనుకూలంగా ఓటేశారు.

మరికొద్ది నెలల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'ఇండియా' కూటమిలో కీలక నేతగా ఉన్న నీతీశ్ కుమార్​కు జేడీయూ పగ్గాలు చేపట్టాలని పార్టీ నేతలు కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీతీశ్ కుమార్​ను జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్ సింగ్ ప్రతిపాదించారని బిహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. 'లలన్ సింగ్​ లోక్​సభ ఎన్నికల బరిలో ఉండడం వల్ల కాస్త బిజీగా ఉంటానని నీతీశ్​కు చెప్పారు. అందుకే జేడీయూ పగ్గాలు నీతీశ్ కుమార్​కు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. ' అని విజయ్ కుమార్ చెప్పారు.

'నీతీశ్​కు ఆ ఉద్దేశం లేదు'
బిహార్ సీఎం నీతీశ్ కుమార్​కు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం లేదని జేడీయూ నేత శ్రవణ్ కుమార్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్ష కూటమి 'ఇండియా'ను మరింత పటిష్ఠం చేసి, దేశాన్ని బీజేపీ ముక్త్ భారత్​గా మార్చాలనేది నీతీశ్ కోరిక అని తెలిపారు.

  • VIDEO | "Nitish Kumar has no intention of becoming the Prime Minister, his only wish is to make the INDIA alliance stronger and free India from BJP in 2024," says JD(U) leader Shravan Kumar. pic.twitter.com/LV8w7cAHrA

    — Press Trust of India (@PTI_News) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నీతీశ్ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి
2024 లోక్​సభ ఎన్నికలు, 2025లో జరిగే బిహార్​ శాసససభ ఎన్నికలకు నీతీశ్​ కుమార్​ నేతృత్వంలో పోటీ చేయాలని జేడీయూ భావిస్తోంది. అందుకు లలన్ సింగ్​ స్థానంలో నీతీశ్​ను జేడీయూ అధ్యక్ష స్థానాన్ని చేపట్టాలని గత కొంత కాలంగా పార్టీ నేతలు కోరారు. తాజాగా నీతీశ్ కుమార్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2016 నుంచి 2020 డిసెంబరు వరకు నీతీశ్ కుమార్​ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. 2020లో ఆయన పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. నీతీశ్ స్థానంలో ఆర్​పీ సింగ్ జేడీయూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

28 వెడ్స్​ 14- పేరెంట్స్​కు తెలియకుండా మ్యారేజ్​, పుట్టింటికి పంపించనని వింత వాదన!

ఐదేళ్లలో 50ఉపగ్రహాల ప్రయోగం- ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన

Last Updated : Dec 29, 2023, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.