ETV Bharat / bharat

జనసేన పోటీచేసే 6 నియోజకవర్గాలు ఖరారు, మరో 3 స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు - Janasena Contest in Telangana Elections 2023

Janasena alliance with BJP
Janasena
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 3:00 PM IST

Updated : Nov 5, 2023, 4:36 PM IST

14:49 November 05

బీజేపీతో జనసేనకు కుదిరిన పొత్తు అవగాహన

Janasena Alliance With BJP in Telangana : తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు (BJP Janasena Alliance) మరో అడుగు ముందుగు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఆ స్థానాల ఖరారుపై ఇరు పార్టీలు దృష్టిసారించాయి. పొత్తులో భాగంగా.. ఖమ్మం, అశ్వరావుపేట, కొత్తగూడెం, కూకట్‌పల్లి, వైరా, నాగర్‌కర్నూలులో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా, మరో 3 స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇవాళ రాత్రికి ఈ 3 స్థానాల పేర్లు కూడా ఖరారయ్యే అవకాశముంది.

Telangana Assembly Elections 2023 : తొలుత జనసేన రాష్ట్రంలో 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజాగా జరిగిన చర్చల్లో 9 స్థానాలకు ఆ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. కూకట్‌పల్లితో పాటు మరో 8 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే మిగిలిన 31 స్థానాలకు గానూ తొమ్మిది చోట్ల జనసేన బరిలోకి దిగనుండగా.. 22 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌ కల్యాణ్‌ హాజరు కానున్నారు.

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

Janasena to Contest Telangana Assembly Elections 2023 : ప్రధాని సభలో పాల్గొనాలని పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు కోరగా.. దీనికి ఆయన అంగీకరించారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన.. గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకరించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. తెలంగాణ రాష్ట్రానికి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అవసరమని తెలిపారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని వెల్లడించారు.

ముచ్చటగా మడోసారి కూడా మోదీనే ప్రధాని : ఒకటీ రెండు సీట్లు తప్ప మిగిలిన వాటిపై ఒప్పందానికి వచ్చామని పవన్ కల్యాణ్ చెప్పారు. నరేంద్ర మోదీయే మూడోసారి ప్రధాని కావాలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో కూడా ప్రధానిగా మోదీ ఉండాల్సిన ఆవశ్యకతపై చర్చించామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ముందుకువెళ్లాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే బీసీ బహిరంగ సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్‌ వివరించారు.

Janasena Contest in Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని జనసేన నేతలు తెలిపారు. అయితే ఈసారి తొమ్మిది స్థానాల్లోనే పోటీకి దిగాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనసేన పోటీచేసే 6 నియోజకవర్గాలపై స్పష్టత రాగా... మూడు స్థానాల విషయంలో కసరత్తు జరుగుతోంది.

బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

BJP and Janasena Alliance in Telangana : కేంద్రమంత్రి అమిత్​ షాతో పవన్​ కల్యాణ్​ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చినట్లేనా?

Last Updated : Nov 5, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.