శాసనసభ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్మకశ్మీర్‌లోని నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఏర్పాటైన (డీలిమిటేషన్) కమిషన్‌తో భేటీ అయ్యేందుకు దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అంగీకరించాయి. మంగళవారం శ్రీనగర్‌కు చేరుకున్న కమిషన్.. బుధవారం ఒక సమావేశం నిర్వహించి, పునర్విభజనపై వాటి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.
పీడీపీ, ఏఎన్‌సీ మాత్రం ..
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఏఎన్‌సీ) పార్టీలు మాత్రం ఈ భేటీకి హాజరు కాకూడదని నిర్ణయించాయి. కమిషన్ ఎలాంటి చట్టబద్ధత లేదని, జమ్మూ-కశ్మీర్ ప్రజల రాజకీయాధికారాలను తొలగించే ప్రక్రియలో కమిషన్ ఒక భాగమని పీడీపీ ఆరోపించింది. కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్‌కు ఈ మేరకు లేఖ రాసింది. కమిషన్ రాక అంతా ముందస్తు వ్యూహంలో భాగమేనంది. కమిషన్ ఏర్పాటు పైనే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సమావేశానికి తాము వెళ్లడం లేదని ఏఎన్‌సీ తెలిపింది.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపనుంది. కాంగ్రెస్ తరపున ఆరుగురు హాజరుకానున్నారు. ఇతర పార్టీలు తమ ప్రతినిధుల్ని పంపనున్నాయి.
ఇదీచూడండి: ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!
ఇదీ చూడండి: 'కశ్మీర్వాసుల్లో అపనమ్మకం తొలగించాలి'