ETV Bharat / bharat

ఆర్మీ హెడ్​క్వార్టర్​ వద్ద డ్రోన్ల​ కలకలం - డ్రోన్​ వార్తలు

జమ్ములోని ఆర్మీ బ్రిగేడ్​ ప్రధాన కేంద్రానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు​ కలకలం రేపాయి. దానిని గుర్తించిన సెంట్రీ కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

suspected drone over brigade headquarters
డ్రోన్​ కలకలం
author img

By

Published : Jun 28, 2021, 12:17 PM IST

జమ్ము శివారులోని ఆర్మీ బ్రిగేడ్​ ప్రధాన కేంద్రానికి సమీపంలో డ్రోన్లు​ కలకలం సృష్టించాయి. రత్నచాక్​-కలుచాక్​ సైనిక స్థావరం వద్ద అనుమానాస్పదంగా ఓ డ్రోన్​ను గుర్తించిన ఆర్మీ సెంట్రీ.. ధ్వంసం చేసేందుకు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో డ్రోన్​ చక్కర్లు కొట్టినట్లు పేర్కొన్నారు.

ఆ తర్వాత మరో డ్రోన్​ చక్కర్లు కొట్టినట్లు జవాన్లు గుర్తించారు. డ్రోన్లు​ కనిపించిన వెంటనే మిలిటరీ స్టేషన్​ ప్రాంతం మొత్తం తనిఖీ చేశారు జవాన్లు. అయితే.. ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని అధికారులు తెలిపారు.

జమ్ములోని వాయుసేన స్టేషన్​లో డ్రోన్​ ద్వారా బాంబు దాడులకు పాల్పడిన మరుసటి రోజునే ఈ ఘటన జరగటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి: డ్రోన్లతో పెనుముప్పు- సమగ్ర కార్యాచరణతోనే అడ్డుకట్ట!

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.