ETV Bharat / bharat

మరికొన్ని రోజుల తర్వాతే లాలూ ఇంటికి! - లాలు కుటుంబం

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసినప్పటికీ.. ఆయన మరికొన్ని రోజుల తర్వాతే ఇంటికి వెళ్లనున్నారు. ప్రస్తుతం దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి వస్తారని లాలూ కుటుంబం తెలిపింది.

lalu prasad yadav, rjd chief
మరికొన్ని రోజుల తర్వాతే లాలు ఇంటికి!
author img

By

Published : Apr 18, 2021, 6:31 PM IST

దాణా కుంభకోణం కేసులో బెయిల్ దక్కించుకున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​.. సోమవారం విడదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన మరికొన్ని రోజుల తర్వాతే ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి వస్తారని లాలూ కుటుంబం తెలిపింది.

లాలూ ప్రసాద్​ యాదవ్​ త్వరగా కోలుకోవాలని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఆకాంక్షించారు. దిల్లీలోని ఎయిమ్స్​లోనే ఆయనకు చికిత్స కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లను విత్​డ్రా చేశారన్న ఆరోపణలతో నమోదైన ఈ కేసులో లాలూకు బెయిల్​ మంజూరు చేస్తూ శనివారం.. ఝార్ఖండ్​ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రాంచీ జైలులో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. గత జనవరిలో విమానం ద్వారా దిల్లీలోని ఎయిమ్స్​కు పంపించారు. తిహాడ్​ జైలు అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఎయిమ్స్​లోనే ఉన్నారు. లాలూ విడుదల నిమిత్తం హైకోర్టు ఉత్తర్వులను సోమవారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు చూపించనున్నారు. ఆ కోర్టు ఇచ్చే ఆదేశాలను రాంచీ జైలు, తిహార్​ జైలు అధికారులకు ఇస్తారు. ఆ తరువాతే.. లాలూ విడుదలకు అవకాశం కలుగుతుంది.

ఇదీ చూడండి: వారణాసిలో కొవిడ్​ పరిస్థితులపై మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.